Five States Exit polls: ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలివీ..
దేశంలో ఐదు రాష్ట్రాల ( Assembly election 2022 ) మినీ సంగ్రామం ముగిసింది. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 690 శాసనసభ నియోజకవర్గాలకు గానూ ఏడు విడతల్లో జరిగిన ఎన్నికలు నేటితో ముగిశాయి.
ఫిబ్రవరి 10న మొదలైన అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం మొత్తం ఏడు విడతల్లో కొనసాగింది. ఉత్తర్ప్రదేశ్లో 403 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏడు దశల్లో పోలింగ్ పూర్తికాగా.. పంజాబ్లో 117, ఉత్తరాఖండ్లో 70, మణిపుర్లో 60, గోవాలో 40 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ ముగిసింది. ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్ పూర్తయ్యింది. ఫిబ్రవరి 20న పంజాబ్లో ఒకేరోజు పోలింగ్ జరగ్గా.. మణిపుర్లో రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి.
ఓవైపు ప్రధాని మోదీతో సహా భాజపా అగ్రనేతలు ప్రచారం నిర్వహించగా.. ప్రతిపక్ష కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ఆద్మీతో పాటు తృణమూల్ కాంగ్రెస్కు చెందిన అగ్రనేతలు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. హోరాహోరీగా కొనసాగిన ఈ ఎన్నికల్లో గెలుపెవరిదనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అభ్యర్థుల భవితవ్యం మాత్రం ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (EVM)లలో నిక్షిప్తమయ్యింది. మార్చి 10వ తేదీన కౌంటింగ్, ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపై ఎగ్జిట్ పోల్స్ (Exit polls) అంచనాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
0 Comments:
Post a Comment