Education: విద్యాశాఖపై సీఎం కీలక సమీక్ష..
విద్యావిధానంలో మార్పుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగుతున్నాయి.. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లీష్ మీడియంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే..
విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. నూతన విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష నిర్వహించారు.. విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు.. వాటి అమలు తీరును సీఎంకు వివరించిన అధికారులు. నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఇప్పటివరకు మ్యాపింగ్ కాకుండా మిగిలిన స్కూళ్లను కూడా మ్యాపింగ్ చేశామని అధికారులు తెలిపారు.. ఇక, ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ప్రతిరోజూ ఒక ఇంగ్లిష్ పదాన్ని నేర్పేలా విద్యార్థులకు బోధన జరుగుతుందని వెల్లడించారు.. వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి డిజిటల్ లెర్నింగ్ ఉంటుందని.. ప్రతి మండలానికి ఒక కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల, ఒక మహిళా జూనియర్ కళాశాల ఉండేలా చర్యలు తీసుకుంటామని. జూనియర్ కళాశాలలు లేని మండలాలను గుర్తిస్తున్నట్టు సీఎంకు వివరించారు.. స్కూళ్లు, వసతులు తదితర అంశాలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుకు ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు..
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నత చదువులు చదువుకున్న టీచర్లు ఉన్నారు.. వారి సేవలను సమర్థవంతంగా వాడుకోగలిగితే.. నాణ్యమైన విద్య అందుతుందని స్పష్టం చేశారు.. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్న ఆయన.. మంచి చదువులు చదువుకున్న టీచర్ల సేవలను వాడుకునేందుకు విధానాలు రూపొందించామని తెలిపారు.. సబ్జెక్టుల వారీగా టీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం.. టీచర్ల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోకూడదని స్పష్టం చేశారు. అలా చేస్తే విద్యార్థుల చదువులు దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్న ఆయన.. టీచర్లు పూర్తిగా విద్యార్థుల చదువులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.. దీంట్లో భాగంగానే బోధనేతర కార్యక్రమాల్లో వారిని వినియోగించకుండా చూడాలని ఆదేశించారు. లెర్నింగ్ టు లెర్న్ కాన్పెప్ట్లోకి తీసుకెళ్లాలని ఆదేశించిన ఏపీ సీఎం.. కొత్తగా ఏర్పడనున్న 26 జిల్లాల్లో కూడా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఉండాలని.. ప్రస్తుతం ఉన్న శిక్షణా కేంద్రాలలో నాడు - నేడు కింద సౌకర్యాలను మెరుగుపరచాలని తెలిపారు. స్కూళ్లలో నాడు - నేడు కింద ఏర్పాటు చేసుకున్న సౌకర్యాల నిర్వహణ బాగుండాలి.. లేకపోతే వ్యర్థమవుతుందన్న ఆయన.. మార్చి 15 నుంచి స్కూళ్లలో నాడు-నేడు రెండో విడత మొదలు పెట్టాలని ఆదేశించారు.. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యాకానుక అందించాలని స్పష్టం చేసిన సీఎం.. ప్రైవేటు కాలేజీల్లో కూడా సౌకర్యాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
విద్యాశాఖపై సమీక్షించిన సీఎం జగన్.. అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా ఆటస్థలాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బడులు తెరిచే నాటికి పిల్లలకు విద్యాకానుక అందించాలన్నారు.
టీచర్లు పూర్తిగా విద్యార్థులకు అందుబాటులో ఉండాలని, వారి సేవలను బోధనేతర కార్యక్రమాలకు వాడకూడదని చెప్పారు. కొత్త జిల్లాల్లో కూడా టీచర్ల ట్రైనింగ్ సెంటర్లు ఉండాలని సూచించారు. మార్చి 15 నుంచి నాడు-నేడు రెండో విడత పనులు మొదలుపెట్టాలన్నారు.
0 Comments:
Post a Comment