డయాబెటిస్ (Diabetes). ఒక సాధారణ వ్యాధి (disease) కావచ్చు. కానీ ఎవరికైతే డయాబెటిస్ వచ్చిందో వారికి జీవిత కాలంలో చాలా కాలం మధుమేహం (diabetes) ఉంటుంది.
శరీరంలో గ్లూకోజ్(glucose) పరిమాణం పెరిగినప్పుడు వచ్చే ఈ పరిస్థితిని డయాబెటిస్ అంటారు ఇన్స్యులిన్ హార్మోన్ (hormone) స్థాయి తగ్గడం వల్ల ఇది సంభవిస్తుంది, తరచుగా మూత్ర విసర్జన (పాలీయూరియా), పొడి గొంతు లేదా తరచుగా దాహం వెయ్యడం (పాలీడిప్సియా), కంటి చూపు(eye site) మందగించడం., కారణం లేకుండా ఆకస్మిక బరువు పెరుగుట లేదా బరువు తగ్గడం(weight loss), ఒక్కసారిగా నీరసం అలసటగా అనిపించడం అధికంగా ఆకలి వేయడం దీని ముఖ్య లక్షణాలు.
అయితే మధుమేహం ఉన్న వ్యక్తులకు నడక(walk) మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందట. అయితే రాత్రి వేళల్లో నడిస్తే (night time walk) వారికి మంచి ఫలితాలు వచ్చాయంట. ఆ వివరాలు తెలుసుకుందాం..
ఈ జీవనశైలిలో మార్పులు, పని ఒత్తిడి, ఇతరత్రా విషయాల వల్ల షుగర్ వ్యాధి మనల్ని బానిసను చేసుకుంటోంది.
అయితే తరుచుగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే డయాబెటిస్‌ను మన దరి చేయనీకుండా చేయగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రతిరోజూ భోజనం చేసిన అనంతరం ఓ 10 నుంచి 15 నిమిషాలు నడిస్తే రక్తంలోని షుగర్ లెవల్స్(sugar levels) భారీగా తగ్గుతాయని గుర్తించారు.
ఎక్కువగా మనం రాత్రివేళ ఆలస్యంగా తిని అలాగే నిద్రిస్తున్నాం. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉందట.
కనుక రోజూ రాత్రిపూట తిన్న తర్వాత ఓ పది నిమిషాలు సరదాగా అలా నడిస్తే బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గి మధుమేహం ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
భోజనం తర్వాత వాకింగ్..
రాత్రిపూట భోజనం (Night food) తర్వాత వాకింగ్ (walking) చేసిన వారిలో ఏకంగా 22 శాతం వరకు షుగర్ లెవెల్స్ తగ్గినట్లు పరిశోధకులు వివరించారు. ఇలా వాకింగ్ చేస్తే మధుమేహం సమస్య దరిచేరదని చెబుతున్నారు.
శరీరానికి మానసిక, శారీరక ఉల్లాసం దొరుకుతుందట. వారి పనితీరు సైతం మెరుగైనట్లు ఆ రిపోర్టులో తెలిపారు.
టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లను వారికి వీలున్న సమయంలో 30 నిమిషాలపాటు నడవాలని నిపుణులు(experts) సూచిస్తున్నారు.
ఓ పరిశోధనలో అలా నడిచిన వారి బ్లడ్ షుగర్ లెవెల్స్ పరిశోధకులు కొలిచారు.
రాత్రిపూట భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు నడిచిన తర్వాత డయాబెటిస్ పేషెంట్ల రక్తంలోని షుగర్ లెవల్స్‌ను పరీక్షించిన శాస్త్రవేత్తలకు మంచి ఫలితాలు వచ్చాయంట.
మామూలు సమయంలో అరగంట సమయం నడిచిన వారి కన్నా భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేసిన వారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ 12శాతం అధికంగా తగ్గిపోయాయి.
0 Comments:
Post a Comment