Diabetes Patients: డయాబెటీస్ పేషెంట్లకి ఇది తెలుసా.. షుగర్ లెవల్స్ సింపుల్‌గా కంట్రోల్..!
Diabetes Patients: హోలి సందర్భంగా ప్రతి ఒక్కరు స్వీట్లని ఆరగిస్తారు. ఇందులో డయాబెటీస్ పేషెంట్లు కూడా ఉంటారు. పండగ కాబట్టి ఎవరూ అడ్డు చెప్పరు.
దీంతో గట్టిగా లాగించేస్తారు. ఇంకేముంది రక్తంలో చక్కెర స్థాయి విపరీతంగా పెరుగుతుంది. మళ్లీ ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు ఏదైనా తినడానికి ముందు కొంచెం ఆలోచించాలి. వైద్యుల సలహా మేరకు కొద్దిపాటి తీపిని తినవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవ్వరు కాంగరుపడొద్దు. మందులతో పాటు ఈ హోం రెమిడీస్ పాటిస్తే సరిపోతుంది. వాస్తవానికి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ధనియాలు బాగా పని చేస్తాయి. ఇందులో ఉండే ఇథనాల్ రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే.. స్వీట్లు ఎక్కువగా తిన్న మరుసటి రోజు ధనియాల నీరు తాగాల్సి ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి కొంచెం ధనియాలని తీసుకుని వాటిని నానబెట్టాలి. కాసేపయ్యాక వడపోసి తాగాలి. ఇది బ్లడ్ షుగర్ లెవెల్‌ని బాగా కంట్రోల్ చేస్తుంది.
ధనియాల ఇతర ప్రయోజనాలు
మధుమేహంతో పాటు స్థూలకాయంతో బాధపడేవారికి ఇది దివ్యౌషధం అని చెప్పవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ధనియాల నీటిని రోజూ తాగితే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మధుమేహం మాత్రమే కాదు ఇతర వ్యాధులను ఎదుర్కొంటున్న వారు కూడా ఈ హోం రెమెడీని ప్రయత్నించవచ్చు. జీర్ణవ్యవస్థ సరిగా లేనివారు ధనియాల నీటిని తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు.
కాకరకాయ రసం
కాకరకాయ రుచి చాలా చేదుగా ఉంటుంది. అందుకే చాలా మంది తినడానికి ఇష్టపడరు. అయితే ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కాకర రసం మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో చరటిన్, మోమోర్డిసిన్ రసాయనాలు ఉంటాయి. ఇవి డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని తగ్గించడంలో సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ ఉదయం పూట కాకర రసాన్ని తాగవచ్చు. ఇది అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
0 Comments:
Post a Comment