కొత్త జిల్లాల్లో డీఈవోల నియామకానికి పదోన్నతులు
*🌻ఈనాడు, అమరావతి*: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జిల్లా విద్యాధికారులు, డిప్యూటీ డైరెక్టర్ల పదోన్నతులకు పాఠశాల విద్యాశాఖ సీనియారిటీ జాబితా రూపొందించింది. డిప్యూటీ విద్యాధికారులు, సహాయ సంచాలకులు, బీఈడీ, డైట్ లెక్చరర్లతో పదోన్నతుల జాబితాను సిద్ధం చేశారు. 14 మంది అధికారులకు పదోన్నతులు కల్పించనున్నారు. ఉగాదికి కొత్త జిల్లాల ఏర్పాటు చేయనున్నందున జిల్లా విద్యాధికారుల నియామకానికి ఈ ప్రక్రియ చేపట్టారు.
0 Comments:
Post a Comment