'సీపీఎస్‌పై చర్చించుకుందాం రండి'.. ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం
Finance Ministry Invited Employees to Discuss on CPS: 'సీపీఎస్ అంశంపై చర్చించుకుందాం రండి' అని ఉద్యోగ సంఘాలకు ఆర్థిక శాఖ ఆహ్వానం పంపింది.
ఈ మేరకు ఏప్రిల్ 4వ తేదీన సచివాలయంలో సంప్రదింపుల సమావేశం ఏర్పాటు చేసినట్టు ఆ శాఖ అధికారి తెలిపారు.
finance department on CPS: సీపీఎస్ అంశంపై చర్చలకు రావాల్సిందిగా ఉద్యోగ సంఘాలను ఆర్థిక శాఖ ఆహ్వానించింది. ఏప్రిల్ 4వ తేదీన సాయంత్రం 5 గంటలకు సచివాలయంలోని ఆర్థికశాఖ కాన్ఫ్రెన్స్ హాల్లో సీపీఎస్‌పై సంప్రదింపుల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు ఆ శాఖ హెచ్ఆర్ విభాగం ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 16 ఉద్యోగ సంఘాలకు ఈ ఆహ్వానం పంపారు. ఉద్యోగ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు సీపీఎస్ అంశంపై చర్చలకు రావాలని పేర్కొన్నారు.
ఏప్రిల్ 4న సా. 5 గంటలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. అయితే సమావేశానికి సీపీఎస్ సంఘాలకు ఆహ్వానం అందలేదు.
దెబ్బ ఒక చోట తగిలితే మందు మరోచోట పూస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వంపై సీపీఎస్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమను విడిగా అయినా సమావేశానికి పిలవాలని డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీ తరహాలోనే సీపీఎస్‌పై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటూ ప్రభుత్వం మరో డ్రామాకు తెరలేపిందని సంఘాలు మండిపడుతున్నాయి.
0 Comments:
Post a Comment