COVID Restrictions: కొవిడ్ ఆంక్షల పై కేంద్రం కీలక నిర్ణయం..
COVID Restrictions: గత రెండేళ్లకుపైగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇటీవల కాస్త తగ్గుతూ వస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య రెండు వేల లోపే నమోదవుతూ వస్తోంది.
మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గుముఖం పట్టింది. కొవిడ్ పరిస్థితులుకాస్త మెరుగవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
కొవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నెలాఖరు తర్వాత (మార్చి 31) తర్వాత కొవిడ్ కఠిన నిబంధనలన్నీంటిని సడలించనున్నట్లు తెలిపింది. అయినప్పటికీ.. ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు మాత్రం కొనసాగుతాయని వెల్లడించింది.
గత ఏడాది నుంచి నిబంధనలు..
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో.. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ (డీఎం) 2005ను అనుసరించి.. 2020 మార్చి 24 నుంచి కఠిన కొవిడ్ నిబంధనలు అమలులోకి తెచ్చింది కేంద్రం. ఆ తర్వాత కొవిడ్ పరిస్థితులను బట్టి నిబంధనల్లో మార్పులు చేస్తూ వచ్చింది. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుమgఖంపట్టిన కారణంగా.. కొవిడ్ ఆంక్షలన్నీ ఎత్తవేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే జనసందోహం ఉన్న ప్రాంతాల్లో, బహిరంగ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని వివరించింది కేంద్రం.
ఇంతకు మందే పౌర విమానయాన శాఖ (డీజీసీఏ).. విమానాల్లో సిబ్బంది పీపీఈ కిట్ ధరించడం నుంచి మినహాయింపునిచ్చింది. ఇప్పడు తాజాగా కఠిన కొవిడ్ నిబంధనలన్నింటి నుంచి మినహాయింపు ఇవ్వడం గమనార్హం.
0 Comments:
Post a Comment