Coconut Water Benefits: వేసవి కాలం రానే వచ్చేసింది. మార్చి నెలలో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజూ మనం తినే ఆహారంలో కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల వడదెబ్బ నుంచి బయటపడొచ్చు. ప్రతిరోజూ కొబ్బరినీరు తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
దీని వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండార జాగ్రత్త వహించవచ్చు.
అయితే కొబ్బరినీరు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక రక్తపోటు నియంత్రణ కోసం..
రక్తపోటు అదుపులో ఉండేందుకు రోజూ కొబ్బరినీళ్లు తాగడం మంచిది. అధిక రక్తపోటును నియంత్రించడంలో కొబ్బరి నీరు కీలకపాత్ర పోషిస్తాయి.
ఈ రక్తపోటు సాధారణ స్థాయిని తీసుకొచ్చేందుకు కొబ్బరి నీరు సహకరిస్తుంది.
రోగనిరోధక శక్తి మెరుగు..
కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరికాయలో దాదాపు 600 మి.గ్రా పొటాషియం లభిస్తుంది.
ఈ క్రమంలో ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.
వాంతుల నుంచి ఉపశమనం
వాంతులు, విరేచనాల సమస్యతో బాధపడే వారు కొబ్బరి నీరు తాగడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది.
అలాంటి అనారోగ్య సమస్యలతో తరచూ బాధపడే వారు ఈ జాగ్రత్తలు పడితే మంచిది.
వాంతులు, విరేచనాలతో పాటు కడుపులో, పేగుల్లో మంట.. అల్సర్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
0 Comments:
Post a Comment