పాఠశాల విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పేరుతో పంపిణీ చేస్తున్న పౌష్టికాహారంలో కూడా సంబంధిత కాంట్రాక్టర్ కక్కుర్తిపడుతున్నారు.
జిల్లాలోన్ని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు రోజు మార్చి రోజు వేరుశనగ చిక్కీలు కవర్లో పెట్టి అందజేయాల్సి ఉంది. కొత్తపట్నం మండలంలోని పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేస్తున్న వాటిని విద్యార్థులు తెరిచి చూస్తే నిరాశే ఎదురవుతోంది. 100 చిక్కీ ప్యాకెట్లు కాంట్రాక్టర్ పాఠశాలకు సరఫరా చేస్తే అందులో కనీసం 10 అయినా ఖాళీ కవర్లుతో సరఫరా అవుతున్నాయి. దీంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.
మండలంలోని అన్ని పాఠశాలల్లో ఇదే పరిస్థితి. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసేం దుకు ఉపాధ్యాయులు వెనుకంజ వేస్తున్నారు. కాంట్రాక్టర్ రాజకీయ పలుకుబడి కలిగి ఉంటేనే కదా ఈ టెండర్ దక్కింది. మనకెందుకులే a ఉపాధ్యాయు లు మిన్నకుండిపోతున్నారు
0 Comments:
Post a Comment