ఇంజనీరింగ్ చేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(OTA)లో షార్ట్ సర్వీస్ శిక్షణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హులైన అవివాహిత పురుష, మహిళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సు 2022 అక్టోబర్ లో ప్రారంభమవుతుంది.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 193
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 6
*ఇందులో పలు రకాలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. SSC(టెక్) - 175, SSCW(టెక్)- 14, విడోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ - 02, (SSC(W) టెక్ - 01, SSC(W) (నాన్ టెక్) (UPSC కానిది) - 01) పోస్టులు వేకన్సీ ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి బీటెక్ పాసై ఉండాలి. లేదా ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
*వయోపరిమితికి సంబంధించి 2022 అక్టోబర్ 1 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
*మరణించిన రక్షణ సిబ్బంది కుటుంబ సభ్యులు 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియ కోసం https://www.joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
0 Comments:
Post a Comment