విటమిన్ సి.. శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన విటమిన్స్‌లో ఇది ఒకటి.
రోగ నిరోధక శక్తి పెంచడంలోనూ, ఐరన్ గ్రహించేందుకు సహాయపడడంలోనూ, టిష్యులను రిపేర్ చేయడంలోనూ ఇలా అనేక రకాలుగా విటమిన్ సి ఉపయోగపడుతుంది.
నీటిలో కరిగే విటమిన్ సి శరీరంలో తయారు కాదు. నిల్వ కూడా ఉండదు. దాంతో విటమిన్ సి లోపం చాలా మందిలో కామన్‌గా కనిపిస్తుంది. అందువల్ల, ప్రతి రోజు ఆహారం ద్వారా శరీరానికి విటమిన్ సి అందేలా చూసుకోవాలి.
అయితే చాలా మంది తమకు విటమిన్ సి లోపం ఉందనే విషయమే గ్రహించలేకపోతున్నారు. ఫలితంగా, అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కానీ, ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకుంటే.. సులువుగా మీకు విటమిన్ సి లోపం ఉందో.. లేదో.. గ్రహించవచ్చు. విటమిన్ సి లోపం ఉంటే గనుక.. మొదట వచ్చే సమస్య మాటిమాటికీ నీరస పడిపోవడం.
ఏ పని చేయలేకపోతుంటారు. చిన్న పనికి కూడా ఎక్కువ అలసట చెందుతారు. ఇలా అనిపిస్తే ఖచ్చితంగా విటమిన్ సి పుష్కలంగా ఉంటే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
అలాగే సడెన్ గా బరువు తగ్గడం కూడా విటమిన్ సి లోపంగా చెప్పొచ్చు. ఎలాంటి డైట్ పాటించకపోయినప్పటికీ ఉన్నట్టు ఉండి బరువు తగ్గిపోతే గనుక విటమిన్ సి లోపంగా గ్రహించాలి.
ఏదైనా గాయం అయినప్పుడు త్వరగా మానకపోయినా.. తరచూ జాయిన్ పెయిన్ ఇబ్బంది పెడుతున్నా.. దంతాలు వాపులు వస్తున్నా.. సీజన్‌తో పని లేకుండా ఎప్పుడూ చర్మం పొడిబారుతున్నా.. హెయిర్ ఫాల్ అధికంగా ఉన్నా విటమన్ సి లోపాలుగా గుర్తించి.. సరైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక విటమిన్ సి అత్యధికంగా.. నిమ్మకాయలు, బత్తాయిలు, కమలాలు, నారింజలు, ఉసిరి, బొప్పాయి, జామ, కివి పండు, స్ట్రాబెర్రీస్, కాప్పికమ్, బ్రొకోలీ, టమాటాలు వంటి వాటిల్లో ఉంటుంది.
కాబట్టి, వీటిల్లో కొన్నిటిని అయినా రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే.. విటమిన్ సి లోపానికి దూరంగా ఉండొచ్చు.
0 Comments:
Post a Comment