✍జేఈఈ దరఖాస్తుదారుల్లో ఆందోళన
♦కుల, ఆదాయ ధ్రువపత్రాలకు అగచాట్లు
🌻ఈనాడు, అమరావతి
జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ పరీక్షకు దరఖాస్తులు కోరటంతో ప్రస్తుతం విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం సచివాలయాలకు బారులుదీరుతున్నారు. అక్కడా దరఖాస్తుదారుల వివరాలు సైట్లో కనిపించటం లేదని ఆందోళన చెందుతున్నారు. సర్వర్‌లో సాంకేతిక సమస్యలున్నాయని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. కుల, ఆదాయ ధ్రువపత్రాల కోసం తొలుత సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోగానే ఆ వివరాలను సచివాలయ ఉద్యోగులు వెంటనే సర్వీస్ రిక్వెస్ట్ పేరుతో రెవెన్యూశాఖకు చెందిన వీఆర్వో లాగిన్‌కు అప్లోడ్ చేస్తారు. వీఆర్వో ధ్రువీకరించుకుని తహసీల్దార్ లాగిన్‌కు పంపుతారు. ఆయన ఆమోదించగానే సర్టిఫికెట్ జారీ అవుతుంది. దానిపై తహసీల్దార్ డిజిటల్ సంతకం లేకుండా వస్తోందని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు. ఒక్కోసారి సచివాలయం నుంచి వీఆర్వో లాగిన్‌కు పంపుతున్న వివరాలు అతని లాగిన్‌లో డిస్ప్లే కావటం లేదు. ఇన్ని సమస్యలతో సచివాలయాలు కొట్టుమిట్టాడుతున్నా వాటికి పరిష్కారం చూపటం లేదు. కులధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తుకు సైట్ తెరుచుకోవటం లేదని, సర్వర్ పనిచేయటం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆయా సేవలు వేగవంతంగా అందించటానికి వీలుగా ఈఏడాది జనవరి-26న ఏపీ సేవా పోర్టల్-2.0 వెర్షన్ ప్రవేశపెట్టారు. ఈ నూతన సర్వర్‌లో ఒక దరఖాస్తు ఎవరి వద్ద పెండింగ్‌లో ఉందో ప్రతి ఉద్యోగికి తెలుస్తుంది. సచివాలయాల్లో ఆయా సేవలు అందించటానికి 11మంది ఉద్యోగులు ఉంటారు. వారిలో ఆయా సేవలకు సంబంధించిన పత్రాలు ఎవరి వద్ద పెండింగ్ ఉన్నాయో ఇప్పటి దాకా తెలుసుకునే విధానం ఉండేది కాదు. నూతన సర్వర్‌లో ప్రతి సెక్షన్ అధికారి తన ధ్రువీకరణ పూర్తికాగానే ఆటోమేటిక్‌గా అది తర్వాత అధికారి లాగిన్‌కు అప్లోడ్ అవుతుంది. జేఈఈ దరఖాస్తుల సమర్పణకు గడువు దగ్గర పడుతుండటంతో సకాలంలో ఆ పత్రాలు అందకపోతే నష్టపోతామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓబీసీ విద్యార్థులకు జేఈఈలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా కొంత కోటా ఉంటుంది. ఆ కోటాలో సీట్లు పొందాలనుకునే వారికి సకాలంలో కులధ్రువీకరణ పత్రం సమర్పించకపోతే నష్టపోతామంటున్నారు. తొలుత ఈ పత్రాలు పొంది తాము కళాశాలలకు పంపితే అక్కడి నుంచి దరఖాస్తులు పంపుతారని విద్యార్థులు చెబుతున్నారు. కళాశాలల నుంచి వాటి కోసం ఒత్తిడి బాగా ఉంటోందని విద్యార్థులు తెలిపారు. దీనిపై సచివాలయ అధికారులను సంప్రదించగా తహసీల్దార్ సర్టిఫికెట్‌పై సంబంధిత అధికారి డిజిటల్ సిగ్నేచర్ ఉండటం లేదు. అలా లేకుండా వచ్చే పత్రాలు చెల్లుబాటు కావు.
0 Comments:
Post a Comment