ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు..
గుంటూరు జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. ఒకరేమో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, మరో ఉపాధ్యాయిని ఆ పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్, హెచ్ఎంల పట్ల అగౌరవంగా ప్రవర్తించటం, డ్రెస్‌కోడ్‌కు విరుద్ధంగా వస్త్రధారణ ధరించి పాఠశాలకు రావటాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి గంగాభవానీ తీవ్రంగా పరిగణించి వారిద్దరిని సస్పెండ్ చేశారు.
మేడికొండూరు మండలం డోకిపర్రు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసే వారిద్దరు ఏకకాలంలో సస్పెండ్ కావటం ఉపాధ్యాయవర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. లూర్దు సౌరీయల్ అనే ఉపాధ్యాయుడు సెకండరీగ్రేడ్ టీచర్. ఆ పాఠశాలలో చదివే ఒకరిద్దరు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వీడియో ఒకటి జిల్లా విద్యాశాఖకు అందింది. ఎంఈఓ విచారణలోనూ ఆ ఉపాధ్యాయుడి ప్రవర్తన నిరూపణ కావటంతో అతన్ని సస్పెండ్ చేసినట్లు అధికారులు చెప్పారు. అదే పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయిని జి. రాణి చుడీదారు ధరించి వస్తున్నారని, ఎవరు చెప్పినా పట్టించుకోలేదు. విద్యా కమిటీ ఛైర్మన్‌ను అగౌరవపరిచేలా మాట్లాడారన్న అభిపాయోగాలపై సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
No this is.not.correct
ReplyDelete