సినిమాహాలు.. అయిదు నెలలు మాత్రమే
సినిమాహాలు.. అయిదు నెలలు మాత్రమే
మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్
రాజానగరం: మన ప్రాంతంలో ఒక సినిమాహాలు కడుతున్నారంటే సినిమాలు చూసేందుకు ఇక దూరం వెళ్లనవసరం లేదని ఎంతో సంబర పడిపోతాం.
ఆ సరదా కేవలం అయిదు నెలలే ఉంటే.. ఆసక్తిగా ఉంది కదూ.. ఇదేనండి మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్. కావాల్సిన చోట ఏర్పాటు చేసుకోవచ్ఛు వద్దనుకుంటే వెంటనే తీసేయొచ్ఛు ఇంతకీ దీని విశేషాలను తెలుసుకుందామిప్పుడు.. రాజానగరం సమీపంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాల, ఆస్పత్రి ప్రాంగణంలో మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సింథటిక్ రబ్బరుతో దీర్ఘ చతురస్రాకారంలో బెలూన్ మాదిరిగా థియేటర్‌ను రూపొందిస్తున్నారు. 24 అడుగుల వెడల్పు, పది అడుగుల ఎత్తున తెర ఏర్పాటు చేయనున్నారు. అయిదు ఏసీలు, 7.1 సౌండ్ సిస్టమ్ అమర్చనున్నారు. 120 మంది ప్రేక్షకులు కూర్చునే విధంగా లోపల సిద్ధం చేస్తున్నారు. దీనిని అయిదు నెలల కాలపరిమితితో తీర్చిదిద్దుతున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సినిమాను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా దీనిని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో దీనిని ప్రారంభిస్తారని భావించారు. ఇంకా కొన్ని అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. దీనిని కేవలం అయిదు గంటల వ్యవధిలో థియేటర్‌గా తయారు చేస్తారు. అయిదు నెలల అనంతరం దేనికది విడదీసి మరో ప్రాంతానికి తరలించేస్తారు.
సిద్ధం చేస్తున్న లోపలి భాగం
0 Comments:
Post a Comment