ఉదయం చక్కగా ప్రారంభమైతే ఆ రోజంతా హాయిగా గడిచిపోతుందని అంటారు. అందుకే ఉదయం నిద్ర లేచిన వెంటనే భగవంతుని నామస్మరణ లేదా అరచేతుల దర్శనం చేసుకోవాలని చెబుతారు.
ఫలితంగా ఆ వ్యక్తి మనసు సంతోషంతో నిండిపోతుందట. అతను రోజును సానుకూలశక్తితో ప్రారంభిస్తాడు. చాణక్య నీతిలో.. ఆచార్య చాణక్య.. ప్రతిరోజూ విజయవంతంగా సాగేందుకు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపాడు.
చాణక్య నీతి ప్రకారం మీరు ప్రతిరోజు బాగుండాలని కోరుకుంటే.. దాని కోసం ఒక పనిని మానుకోండి.
ఉదయం నిద్రలేచిన తర్వాత ఎవరిపైనా కోపం తెచ్చుకోకండి లేదా ఎవరితోనూ దూషించే మాటలు మాట్లాడకండి.
ఇలాంటి పనులు చేస్తే ఎదుటివారి మూడ్ చెడటమే కాకుండా మీకు కూడా హాని కూడా కలుగుతుంది. ఇటువంటి చర్య వల్ల ఏర్పడిన ప్రతికూలత మిమ్మల్ని రోజంతా వదలదు.
కాబట్టి ఎప్పుడూ ఉదయాన్నే ఆనందంగా ఉంటూ రోజును ఉత్సాహంగా ప్రారంభించండి. చాణక్య నీతి ప్రకారం మీరు మీ జీవితంలో విజయం సాధించాలంటే, ఉదయాన్నే నిద్రలేవండి.
బ్రహ్మ ముహూర్తం నుండి సూర్యోదయం మధ్యలో నిద్రలేవడం మంచిది. ఇలా చేయడం ద్వారా వ్యక్తి ఆరోగ్యంగా, సానుకూలంగా ఉంటాడు. అతను మంచి లక్షణాలను పెంపొందించుకోగలుగుతాడు.
అతని మనస్సు కూడా ప్రశాంతంగా, తాజాగా ఉంటుంది. అలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఆలస్యంగా నిద్రించే వ్యక్తులు ఉదయం వేళ ఉండే సానుకూలతను ఆస్వాదించలేరు.
వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోకుండా బద్దకస్థులుగా మారుతారు. ఇలాంటివారు విజయాన్ని పొందలేరు.
0 Comments:
Post a Comment