✍టీచర్లలో ‘టిస్’ ఆందోళన
♦టీఐఎస్ సర్వర్ మొరాయింపు
*🌻ఏలూరు ఎడ్యుకేషన్, మార్చి 3 :* ఉపాధ్యాయుల పదోన్నతికి అవసరమైన వివరాలు/సమాచారం కోసం ప్రామాణికంగా తీసుకునేందుకు విద్యాశాఖ కొత్తగా ప్రవేశపెట్టిన టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టీఐ ఎస్) వెబ్సైట్ పూర్తి సామర్ధ్యంతో పని చేయడం లేదు. ఫలితంగా టీచర్లు రోజులతరబడి నిరీక్షించాల్సి వస్తుంది. జిల్లాలో మొత్తం 13 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా టీఐఎస్లో వివరాల అప్లోడ్కు గడువు ఈనెల 2వ తేదీతో ముగిసింది. పూర్తిస్థాయిలో టీచర్లు వివరాలను అప్లోడ్ చేయక పోవడంతో బుధవారం కూడా అనుమ తించి నప్పటికీ, సాయంత్రానికి 9,800 మంది మాత్రమే తమ సమాచారాన్ని అప్లోడ్ చేయగలిగారు. పదవ తరగతి నుంచి ఉన్నత విద్య, ఉపాధ్యాయ వృత్తి విద్య వరకు సాధించిన మార్కులు, హాల్ టికెట్ల నెంబర్లతో సహా టీఐఎస్లో అప్లోడ్ చేయాల్సి ఉం టుంది. దీనినే సీనియార్టీకి ప్రామాణికంగా తీసుకుని ఇక మీదట జిల్లా స్థాయిలో కాకుండా విద్యాశాఖ కమిషనరేట్ నుంచే పదోన్న తులకు అర్హులైన టీచర్ల జాబితాను రూపొందించి నేరుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు టీఐఎస్ను విని యోగించుకోనున్నారు. ఇంతటి ప్రాధాన్యం గల టీఐఎస్ కార్యక్రమానికి గడువును మరికొన్ని రోజులు పొడిగించడంతో పాటు సర్వర్ సమస్యలను అధిగ మించేలా చర్యలు తీసుకోవాలని టీచర్లు కోరుతున్నారు.
0 Comments:
Post a Comment