అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు భవిష్యత్తులో అమలు చేయాల్సిన పదోన్నతులు, వారికి ఉద్యోగ భద్రత, ఇతర అరశాలపై ప్రత్యేకంగా చట్టం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముసాయిదా తయారు చేసిన అనంతరం వచ్చే శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా పదోన్నతులపైనే ఈ చట్టంలో స్పష్టత ఇవ్వనున్నారని తెలిసింది. 2019లోనే గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల నియామకాలు జరిగాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్, ఉత్తర్వులను జారీ చేశారు. అయితే కొత్తగా అన్ని అరశాలతో ఒక చట్టాన్ని తయారు చేయాలని భావిస్తున్న హోంశాఖ, అరదుకు అనుగుణంగా ముసాయిదాను సిద్ధం చేస్తోంది. ప్రత్యేక మహిళా పోలీస్‌గా నియమితులైన వారిని సాధారణ పోలీసుల మాదిరిగా కాకుండా ఉపయోగించుకోనున్నారు. వారికి కొరతకాలం తరువాత కల్పించే పదోన్నతులను కూడా ఈ మాదిరిగానే అమలు చేయాలని నిర్ణయించారు. ముందుగా వారికి సీనియార్టీ వచ్చిన తరువాత హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి లభిస్తుంది. ఈ కాడర్‌లో వారిని గ్రామాల్లో అయితే ఐదు ఆరు గ్రామాలకు, పట్టణాల్లో అయితే ఐదారు వార్డులకు ఇన్‌ఛార్జ్‌గా నియమించే అవకాశాలు ఉంటాయి. వారి కింద కొత్తగా నియమితులయ్యే సచివాలయ కార్యదర్శులు పనిచేయాల్సి ఉంటుంది. అలాగే తరువాత పదోన్నతిలో ఎస్ఐగా నియామకం జరిగి, వారికి రెరడు మూడు మండలాలకు ఇన్ఛార్జిగా నియమించనున్నారు. అనంతర పదోన్నతిలో జిల్లాకు ఒక ఇన్స్పెక్టర్గా నియమిరచనున్నారు. ఈ వరుస క్రమ పదోన్నతులను చట్టంలో స్పష్టంగా పొందుపరచాలని యోచిస్తున్నారు. గతంలో ప్రకటించిన విధంగా జూన్ నాటికి ప్రొబేషన్ డిక్లేర్ చేసేందుకు కూడా కార్యాచరణ కూడా వేగంగా జరుగుతోంది. అప్పటికి ముసాయిదా చట్టం కూడా సిద్ధమవుతుందని చెబుతున్నారు. వర్షాకాల సమావేశాల్లో దీనికి చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు తీసుకురటున్నామని సీనియర్ హోంశాఖ అధికారి ఒకరు చెప్పారు.
0 Comments:
Post a Comment