‘సచివాలయాల ఉద్యోగులకు సెలవులు ఇవ్వొద్దు’
🌻ఈనాడు, అమరావతి*: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు సోమవారం హాజరు పట్టికలో సంతకాలు చేసి వాటి స్కానింగ్ ప్రతుల్ని ఉదయం 10.45 గంటల్లోగా ఉన్నతాధికారులకు పంపించాలని కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. ఉద్యోగులకు సోమవారం సెలవులు మంజూరు చేయొద్దని, వారు హెడ్క్వార్టర్లు విడిచిపెట్టి వెళ్లరాదని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన, అంగన్వాడీ కార్మికులతోపాటు నాలుగో తరగతి ఉద్యోగులు సోమవారం ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పలు జిల్లాల కలెక్టర్లు ఆదివారం.. డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులకు ఈ మేరకు సందేశాల్ని పంపించారు. ‘చలో విజయవాడలో ఎవరూ పాల్గొనవద్దు. సెక్షన్ 144 కింద విజయవాడలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. పాల్గొన్న వారిపై చర్యలు తప్పవు. ఉద్యోగులకు సమస్యలుంటే ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇవ్వొచ్చు’ అని ఆ సందేశాల్లో పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment