✍చర్చల హామీల జిఓలు ఏవీ...?
♦ఉద్యోగ సంఘాల ఎదురు చూపులు
🌻ప్రజాశక్తి - అమరావతి బ్యూరో
పిఆర్సి నివేదికలు విడుదల చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి జిఓలు విడుదల కోసం ఉద్యోగ సంఘాల నాయకులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పిఆర్సిని ప్రతి పదేళ్లకు ఒకసారి వేస్తామని ఇచ్నిన ఉత్తర్వులను సవరించి ఐదేళ్లకే వేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ జిఓ కూడా విడుదల కాలేదు. ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ పేస్కేల్ ఫిక్సేషన్‌పై ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. అది ఇవ్వలేదు. వారికి 2017 జులై 2018 జులైలో ఫిక్స్ చేయాల్సి, ఉంది. ప్రస్తుతం 2020 పేస్కేలు ఫిక్స్ చేసి కొత్త సూచనలను అమలు చేయాల్సి ఉంది. అటువంటి నిర్ణయం ఏదీ ప్రభుత్వం తీసుకోకపోవడంతో వచ్చే కమిషన్‌లోనే వారికి పిఆర్సి వర్తించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పాతజీతాలే తీసుకుంటున్నారు. గురుకులాలు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు సంబంధించిన జిఓలూ ఇవ్వాల్సి ఉంది. ముఖ్యంగా 2019 జులై నుండి 2020 మార్చి వరకూ ఫిట్మెంట్ 27 శాతం ప్రకారం ఇచ్చిన జీతాలకు సంబంధించి రికవరీ చేయాల్సి ఉంటుందని, ఇది సుమారు రూ.5000 కోట్ల పైబడి ఉండొచ్చని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై తీరవ స్థాయిలో ఆందోళన వ్యక్తం కావడంతో రివకరీలు రద్దు చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఆ జిఓ కూడా విడుదల కాలేదు.. 2019 జులై, 2021 జులై డిఏ బకాయిలూ ఉన్నాయి. విడుదల చేయాలని ఉద్యోగులు కోరగా దీనికి ప్రభుత్వం అంగీకరించింది. దీనిపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. చర్చలు పూర్తయిన అనంతరం రెండురోజుల క్రితం ఒకరిద్దరు ఉద్యోగ సంఘాల నాయకులు సిఎంఓలో అధికారులను కలిసి వచ్చారు. కమిషన్ నివేదికను బయటపెట్టే ముందే తమకు ఇవ్వాలని, తాము పరిశీలించిన తరువాత బయటకు ఇవ్వాలని కోరారు. సోమవారం నివేదిక ఇస్తామని తెలిపినా శనివారం రాత్రే నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో మంత్రులు మాట్లాడిన సమయంలో కమిషన్ నివేదికతో పాటే ఇచ్చిన హమీల మేరకు అన్ని ఉత్తర్వులు ఇస్తామని ప్రకటించారని, ఆది అమలు కాలేదని అంటున్నారు.
0 Comments:
Post a Comment