Black Pepper Benefits: మసాలా దినుసులుగా ఉపయోగించే నల్ల మిరియాలు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
నల్ల మిరియాలను (Black Pepper) ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో తీసుకుంటే, అది మన శరీరానికి గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది.
అవేంటో ఒకసారి చూద్దాం.
1. స్టామినా పెంచుతుంది
నల్లటి మిరియాలను గోరువెచ్చని నీళ్లతో తీసుకుంటే స్టామినా పెరుగుతుంది.
2. కడుపు నొప్పి తగ్గుతుంది
కడుపులో గ్యాస్ లేదా అసిడిటీ ఉంటే నిమ్మరసంలో చిటికెడు బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
3. టెన్షన్ పోతుంది
బ్లాక్ పెప్పెర్ లో పైపెరిన్ ఉంటుంది. ఇది యాంటీ డిప్రెసెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా నల్ల మిరియాలు ప్రజల ఒత్తిడి, నిరాశను తొలగించడంలో సహాయపడతాయి.
4. చిగుళ్ళు బలహీనంగా ఉండవు
నల్ల మిరియాలు చిగుళ్ల నొప్పికి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.
ఎండుమిర్చి, జాజికాయ, రాళ్ల ఉప్పు ఈ మూడింటినీ సమపాళ్లలో కలిపి పౌడర్లా చేసి కొన్ని చుక్కల ఆవాల నూనె కలిపి దంతాలకు, చిగుళ్లకు పట్టించి అరగంట తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి. దీంతో మీ దంతాలు, చిగుళ్ల నొప్పి సమస్య కూడా దూరమవుతుంది.
5. క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది..
నల్ల మిరియాలు తినడం మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్లు, కెరోటిన్లు మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ను నివారిస్తుంది.
6. జలుబు సమస్య దూరం
బ్లాక్ పెప్పరు వేడిపాలలో కలిపి తాగితే జలుబు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
7. డీహైడ్రేషన్ సమస్యకు చెక్...
మిరియాలను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య దూరమవుతుంది. దీనితో పాటు, చర్మం పొడిబారదు.
0 Comments:
Post a Comment