Bitta karate - 42మంది కాశ్మీరీ పండిట్ లను చంపిన బిట్టా కరాటే.. 31 సంవత్సరాల తరువాత విచారణ...
శ్రీనగర్ : 1990లో Militancy సమయంలో దాదాపు 42 మంది Kashmiri Panditలను హతమార్చిన నిందితుడు Bitta Karateహత్య కేసు విచారణను 31 సంవత్సరాల తర్వాత Srinagar Sessions Court చేపట్టింది.
బాధితుడు సతీష్ టిక్కూ కుటుంబం కోర్టును ఆశ్రయించడంతో బుధవారం ఉదయం 10 :30 గంటలకు విచారణ ప్రారంభమయ్యింది.
'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం విడుదలైన తర్వాత 1990ల నాటి కాశ్మీరీ పండిట్ వలసల పరిస్థితులు గుర్తు చేసుకుంటూ.. ఆ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కున్న ఎంతో మంది బాధితులు, వారి కుటుంబాలు తమ కష్టాలను వివరించడానికి ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో బిట్టా కరాటే లేదా ఫరూక్ అహ్మద్ దార్ పాత్రను చిన్మయ్ మాండ్లేకర్ పోషించాడు. అతను 1990లో జరిగిన అల్లర్లలో దాదాపు '20 కంటే ఎక్కువమందిని'.. లేదా '30-40 కంటే ఎక్కువ మంది' కాశ్మీరీ పండిట్లను చంపి ఉంటాను అని ఒప్పుకున్నాడు.
కరాటే హత్య విచారణను న్యాయవాది ఉత్సవ్ బైన్స్ ద్వారా బాధితుడు సతీష్ టిక్కూ కుటుంబ సభ్యులు తరలించారు. కార్యకర్త వికాస్ రైనా మద్దతు ఇచ్చారు. టిక్కూ స్థానిక వ్యాపారవేత్త, దార్ కు సన్నిహిత మిత్రుడు. 1991లో రికార్డు చేసిన ఓ వీడియో ఇంటర్వ్యూలో కరాటే మాట్లాడుతూ.. "నేను చంపిన మొదటి వ్యక్తి సతీష్ కుమార్ టికూ. అతన్ని చంపమని పైవారి నుండి నాకు ఆదేశాలు వచ్చాయి. అతను హిందూ బాలుడు."
నిందితుడు కొన్నేళ్లుగా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. కాశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకున్న హత్యలకు నాయకత్వం వహించిన జమ్మూ, కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF)కి నాయకత్వం వహిస్తున్నాడు. అతను 1990లలో మారణహోమానికి నాయకత్వం వహించాడని, జూన్ 1990లో అరెస్టయ్యే వరకు JKLFలో నంబర్ వన్ హిట్‌మ్యాన్‌గా పరిగణించబడ్డాడని సమాచారం.
ఇదిలా ఉండగా, బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటీవల విడుదలైన The Kashmir Files సినిమా మీద కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య నేతృత్వంలో బుధవారం ఐపీ కాలేజీ నుంచి కేజ్రీవాల్ నివాసం వరకు ప్రదర్శన జరిగింది. సీఎం కేజ్రీవాల్ నివాసం ముందు ఆందోళన చేపట్టారు. కేజ్రీవాల్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న బీజేపీ కార్యకర్తలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇంటి బయట ఉన్న గేటును ధ్వంసం చేశారు.
కాశ్మీరీ హిందువులపై జరిగిన మారణహోమాన్ని కేజ్రీవాల్ అపహాస్యం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. బీజేపీ జెండాలు పట్టుకున్న పలువురు పోలీసులతో ఘర్షణ పడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. వారిలో కొందరు అక్కడి బారికేడ్ల మీదికి ఎక్కి పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు.
'దేశంలోని హిందువులను అవమానించినందుకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి. ఆయన క్షమాపణ చెప్పే వరకు బీజేపీ యువమోర్చా అతనిని విడిచిపెట్టదు' అని తేజస్వీ సూర్య ట్వీట్ చేశారు. కాగా, కేజ్రీవాల్ ఇంటిముందు బీజేపీ కార్యకర్తల నిరసనను ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.
0 Comments:
Post a Comment