దంతాల (Teeth) ఆరోగ్యం (health) అందరికీ అవసరం. ఉదయం కచ్చితంగా దంతాలను తోముకోవాలి. తరువాతే ఆహారాలను లేదా టీ, కాఫీ వంటివి తీసుకోవాలి. నోటి శుభ్రత లేకపోతే దంతాలు క్షీణిస్తాయి
పుచ్చిపోతాయి. దీంతో దంతాలను తీసేయాల్సి (remove) వస్తుంది. చిగుళ్ల సమస్యలు వస్తాయి. దంతాలు బలహీనంగా (weak) మారుతాయి. కనుక దంతాలను రోజూ తోముకోవాలి.
ఉదయం, రాత్రి భోజనం తరువాత దంతాలను తోముకుంటే ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అయితే చాలామందికి నోటి దుర్వాసన (Bad smell from mouth) వస్తుంది.
ఈ నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్యే. కొన్ని సార్లు ఇది శరీరం లో వివిధ రుగ్మతల వల్ల వచ్చినా, చాల వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వలనే ఈ సమస్య తలెత్తుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దుర్వాసన నుంచి రక్షించుకోవచ్చు.
మౌత్ వాష్ లతో..
సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన మౌత్ వాష్ లతో నోటిని శుభ్రం చేసుకుంటే, మీ నోరు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యంగా మరియు శుభ్రంగా ఉంటుంది. మౌత్‌వాష్‌లు నోటిలోని బ్యాక్టీరియాను సమర్థవంతంగా నాశనం చేస్తాయి.
నోటిలోని బ్యాక్టీరియా నాశనమైతే నోటి దుర్వాసన (Bad smell from mouth) సమస్య ఉండదు.
పళ్లు తోముకునేటప్పుడు..
ఉదయాన్నే పళ్లు తోముకునేటప్పుడు నాలుక (Tongue)ను కూడా టంగ్ క్లీనర్ తో శుభ్ర పరచడం (cleaning) మరిచి పోవద్దు.
అన్నాశయం లోని పూర్తిగా జీర్ణం కాని ఆహారం కొంత కాలం తర్వాత కుళ్లిపోయి దుర్వాసన (bad smell) గల వాయువులను ఏర్పరుస్తుంది.
ఇవి నోటినుండి బయటకు (out) వదలబడతాయి. దాంతో నోటి దుర్వాసన (Mouth bad smell) వస్తుంది.
మనం తిన్న ఆహారంలో కొంత భాగం నాలుకపై పేరుకుపోతుంది. ఇది కూడా దుర్వాసనకు కారణం అందుకే నాలుకను శుభ్ర పరుచుకోవడం ఉత్తమం.
గ్రీన్ టీ తాగండి..
కాఫీ... దుర్వాసనకు ఓ మూల కారణం. అయితే ఈ మధ్య జరిపిన ఒక రీసెర్చ్ ప్రకారం, గ్రీన్ టీ (green tea) ఆరోగ్యాన్నే కాదు, శ్వాస ను కూడా గణనీయంగా మెరుగు పరుస్తుందని తేలింది.
అందుకే మీ కాఫీ రొటీన్లను వీలయితే గ్రీ టీకి మార్చుకోండి. కొబ్బరి, కొబ్బరి నూనెతో ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉంటాయి.
అయితే వీటిల్లో శ్వాస ను మెరుగు పరచడం కూడా ఒకటని చాలా మందికి తెలియదు.
కొద్దిపాటి కొబ్బరి నూనెని నోటిలోకి తీసుకోని నాలుగైదు సార్లు పుక్కిలించడం వలన నోటిలోని హానికారక బాక్టీరియా పోతుంది, చిగుళ్ల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.
0 Comments:
Post a Comment