Teacher attendance through cell phones ..
ఉపాధ్యాయులకు మొబైల్ ఈ-హాజరు ప్రకాశం జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలు..
సెల్ ఫోన్ ల ద్వారా టీచర్ల హాజరు నమోదు..
•మొబైల్ అటెండెన్స్ యాప్ ను అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ
పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన పాఠశాలల్లో విజయవంతంగా హాజరు నమోదు
గుంటూరు ఎడ్యుకేషన్ ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని సులువైన పద్ధతిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదు విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా ఉపాధ్యాయులు తమ సొంత స్మార్ట్ ఫోన్లోనే హాజరు నమోదు విధానాన్ని అభివృద్ధిచేసిన ప్రభుత్వం.. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. హెచ్‌ఎఎస్ టెక్నాలజీ రూపకల్పన చేసిన యాప్‌ను ప్రయోగాత్మకంగా అమలుచేసేందుకు శనివారం రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయ సమన్వయకర్త రమేష్ కుమార్.. డీఈవో సిబ్బందితో కలిసి పిడుగురాళ్లలోని మన్నెం పుల్లారెడ్డి జెడ్పీ కార్యాలయ ఐటీ హైస్కూల్, సత్తెనపల్లి మండలం కొమెరపూడిలోని జెడ్పీ హైస్కూలు వెళ్లారు. ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు చేసుకున్న ఉపాధ్యాయులు.. విద్యాశాఖ నిర్వహిస్తున్న టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టీఐఎస్)లో నమోదు చేసుకున్న సెల్ నంబర్‌ను ఎంటర్ చేసి, వ్యక్తిగత పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యారు. ఓపెన్ చేసిన యాప్ కి సెల్ఫీ తీసుకునేలా చూడటం వల్ల ఫేసియల్ రికగ్నైజేషన్‌తో హాజరు నమోదు చేశారు. ఉదయం, సాయంత్రం కేవలం 30 సెకన్ల చేశారు.
వ్యవధిలో ఉపాధ్యాయులు తమంతట తాముగా స్మార్ట్ ఫోన్
స్మార్ట్ ఫోన్లలో యాప్‌ను ఇన్స్టాల్ చేయించారు. యాప్ ఓపెన్ ద్వారా హాజరు నమోదు చేసుకోవచ్చని రమేష్‌కుమార్
చెప్పారు. పిడుగురాళ్ల పాఠశాలలో 36 మంది, సత్తెనపల్లి పాఠశాలలో 18 మంది చొప్పున ఉపాధ్యాయులు విజయవంతంగా హాజరు నమోదు
ఉపాధ్యాయులకు ముఖ ఆధారిత హాజరు
కొమెరపూడిలో హాజరు నమోదు చేస్తున్న దృశ్యం
పిడుగురాళ్ల, సత్తెనపల్లి, న్యూస్‌టుడే: వేలిముద్ర, కనుపాపల అవసరం లేకుండా ముఖ ఆధారంగా ఉపాధ్యాయుల హాజరు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది.
ఇందుకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఐటీ విభాగం 'మొబైల్ అటెండెన్స్ ఆండ్రాయిడ్ యాప్'ను ప్రత్యేకంగా రూపొందించింది. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలోని పలు పాఠశాలలను ఎంపిక చేశారు. సత్తెనపల్లి మండలం కొమెరపూడిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 18 మంది, పిడుగురాళ్లలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40 మంది ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరును శనివారం విజయవంతంగా నమోదు చేశారు. తొలుత ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల వివరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి మ్యాపింగ్ చేశారు. ఒక్కో ఉపాధ్యాయుడి హాజరు 30 నుంచి 40 సెకన్లలో పూర్తి చేశారు. ఐఫోన్ కాకుండా మిగిలిన అన్ని ఆండ్రాయిడ్ సెల్ఫోన్లలో మొబైల్ అటెండెన్స్ యాప్‌ను నిక్లిప్తం చేసుకుని సులువుగా హాజరు నమోదు చేయడంపై ఉపాధ్యాయులు, రెండు మండలాల ఎమ్మార్సీ ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పాఠశాలలో కాకుండా బయట ఎక్కడి నుంచి హాజరు నమోదు చేసినా గుర్తించే సాంకేతికత ఇందులో ఉండటం గమనార్హం. కార్యక్రమంలో ఐటీ సెల్ కోఆర్డినేటరు వెంకట్రావు, సదాశివారెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు ఎల్.ధనలక్ష్మి, ఎండీ రఫీ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
0 Comments:
Post a Comment