AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆసుపత్రుల్లో హైపటైటిస్ కు వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈమేరకు ఆరోగ్యశాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్న అధికారులు ఆయా ఆసుపత్రులకు ఆదేశాలు జారీచేశారు.
ఏపీలో హెపటైటిస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని గుర్తించిన వైద్యారోగ్యశాఖ..బాధితులకు సత్వర వైద్యం అందేలా చర్యలు ప్రారంభించింది. ఈక్రమంలోనే ఇకపై అన్ని జిల్లా ఆసుపత్రుల్లో హెపటైటిస్ కు వైద్యం అందించాలని నిర్ణయించారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలోని 11 బోధనాసుపత్రులు, 2 జిల్లా ఆసుపత్రుల్లో హెపటైటిస్ కు సంబంధించిన వ్యాధులకు స్క్రీనింగ్ తో పాటు వైద్యాన్ని అందిస్తున్నారు.
తాజా ఆదేశాలతో రాష్ట్రంలోని మొత్తం 26 ఆసుపత్రుల్లో హెపటైటిస్ బీ, సీ వ్యాధిగ్రస్తులకు వైద్యం అందనుంది. నిర్ధారిత కేసుల వివరాలను ఎప్పటికప్పుడు 'నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ పోర్టల్'కు అనుసంధానం చేయనున్నారు.
హెపటైటిస్-బి (Hepatitis B) అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెపటైటిస్-బి వైరస్ ద్వారా ఈ వ్యాధి వస్తుంది.
కాలేయానికి వాపు రావటం, వాంతులు, పచ్చ కామెర్లు ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ముదిరితే కాలేయం గట్టిబడిపోయి (liver cirrhosis) లివర్ కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
0 Comments:
Post a Comment