Andhra Pradesh Covid 19 Cases : ఏపీలో కరోనా కథ మారిపోయింది. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నాయి.
లక్షల నుంచి వేలు..వందలు.. ఇప్పుడు 50 కేసుల కంటే తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే వైరస్ నుంచి ప్రజలు బయటపడుతున్నారు.
కరోనా విషయానికి వస్తే..24 గంటల వ్యవధిలో 39 మందికి కరోనా సోకింది. ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 23,19,367 పాజిటివ్ కేసులకు గాను.23,04,193 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. ఇప్పటి వరకు 14,730 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 450గా ఉందని తెలిపింది. 10 వేల 344 శాంపిల్స్ పరీక్షించగా.39 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. గడిచిన 24 గంటల్లో 45 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని.ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,33,71,025 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.
జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 12. చిత్తూరు 06. ఈస్ట్ గోదావరి 06. గుంటూరు 03. వైఎస్ఆర్ కడప 02. కృష్ణా 00. కర్నూలు 00. నెల్లూరు 02. ప్రకాశం 03. శ్రీకాకుళం 00. విశాఖపట్టణం 00. విజయనగరం 00. వెస్ట్ గోదావరి 02. మొత్తం :- 39
0 Comments:
Post a Comment