ప్రభుత్వశాఖల్లో ఖాళీలు 66,309
జాబ్ క్యాలెండర్ ప్రకటించి భర్తీకి చర్యలు
అసెంబ్లీలో వెల్లడించిన ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వశాఖల్లో 66,309 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
మొత్తం మంజూరైన పోస్టులు 7,71,177 కాగా 5,29,868 మంది శాశ్వత ఉద్యోగులున్నారని గురువారం అసెంబ్లీకి ఇచ్చిన సమాధానంలో పేర్కొంది. 1,75,000 మంది ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపింది. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించింది. రాష్ట్రంలో శాఖలవారీ ఖాళీ పోస్టులు, వాటి భర్తీకి తీసుకుంటున్న చర్యలపై తెదేపా ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, అనగాని సత్యప్రసాద్, మంతెన రామరాజు, ఏలూరి సాంబశివరావు అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ సమాధానం ఇచ్చింది. '2021-22 సంవత్సరానికి 10,143 పోస్టుల్ని భర్తీ చేసేందుకు 2021 జూన్ 18న ఆర్థికశాఖ ఉత్తర్వులిచ్చింది. 22,306 పోస్టుల మంజూరు, భర్తీకి ప్రభుత్వం వివిధ జీవోలకింద అనుమతినిచ్చింది' అని పేర్కొంది.
Agriculture jobs
ReplyDelete