కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 65 ఏళ్ల నుంచే అదనపు పింఛను!
స్థాయీసంఘ సిఫార్సును ఆర్థిక శాఖకు ప్రతిపాదించాం: మంత్రి
ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 65 ఏళ్ల నుంచి అదనపు పింఛను ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని పార్లమెంటరీ స్థాయీసంఘం చేసిన సిఫార్సులను ఆర్థికశాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు.
65 ఏళ్లవారికి 5%, 70 ఏళ్లకు 10%, 75 ఏళ్లకు 15% పింఛను ఇవ్వాలని పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫార్సు చేసినట్లు ఆయన గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
''అదనపు పింఛను ఇవ్వాలన్న పింఛనుదారుల సంఘం డిమాండును ప్రభుత్వం పరిశీలించాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీసంఘం తన 110వ నివేదికలో పేర్కొంది. ఈ మేరకు వివిధ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని అనుసరించి ఈ సిఫార్సులు అమలుచేస్తే తలెత్తే ఆర్థిక ప్రభావాలను లెక్కించి ఈ అంశాన్ని కేంద్ర ఆర్థికశాఖకు ప్రతిపాదించాం'' అని చెప్పారు.
0 Comments:
Post a Comment