అదరగొట్టిన శ్రీకాకుళం అమ్మాయి.. రూ.44లక్షల ప్యాకేజ్ తో అమేజాన్ లో ఉద్యోగం..!
పలాసకు చెందిన స్నేహకిరణ్. రూ.44లక్షల వార్షిక వేతనంతో ఈ ఉద్యోగానికి ఎంపిక కావడం గమనార్హం. చదువు మొత్తం పూర్తి కాకుండానే ఆమె అంత జీతంతో ఉద్యోగం సాధించడం విశేషం.
శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఓ తెలుగమయ్యాయి అదరగొడుతోంది. బీటెక్ చివరి సంవత్సరం చదువుతూనే.. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ లో ఉద్యోగం సాధించింది. తనే పలాసకు చెందిన స్నేహకిరణ్. రూ.44లక్షల వార్షిక వేతనంతో ఈ ఉద్యోగానికి ఎంపిక కావడం గమనార్హం. చదువు మొత్తం పూర్తి కాకుండానే ఆమె అంత జీతంతో ఉద్యోగం సాధించడం విశేషం.
కాగా ఆమె తండ్రి సింహాచలం స్థానిక జీడిపప్పు ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, తల్లి సుభాషిణి గృహిణి. స్నేహ ప్రస్తుతం విశాఖపట్టణంలోని ప్రైవేట్ కాలేజీలో బీటెక్, సీఎస్ఈ చివరి సంవత్సరం చదువుతోంది.
కరోనా మహమ్మారి కారణంగా కాలేజీలు లేకపోయినా.. ఆ సమయాన్ని వృథా చేయకుండా తన చదువు కోసం కేటాయించింది. స్నేహ కరోనా సమయంలో ఆన్లైన్ ద్వారా కోడింగ్ నేర్చుకుంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యింది. చివరకు అమేజాన్ లో ఉద్యోగం సాధించింది. ఆమె ఉద్యోగం సాధించడం పట్ల తల్లి దండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
0 Comments:
Post a Comment