సాక్షి, బాన్సువాడ(నిజామాబాద్): పట్టణానికి చెందిన రుద్రంగి గంగాధర్ అనే వ్యక్తి ఆర్బీఐ ద్వారా వెయ్యి రూపాయల కాయిన్ తెప్పించుకున్నాడు.
పూరీజగన్నాథ రథయాత్రకు వెయ్యి ఏళ్ళు అయిన సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల పూరీ జగన్నాథుని చిత్రంతో కాయిన్‌ను విడుదల చేసింది.
వివిధ రకాల కాలాలకు సంబంధించిన కాయిన్లు, నోట్లు సేకరించే అలవాటు గంగాధర్‌కు ఎప్పటి నుంచో ఉంది.
300 ఏళ్ల నుంచి చలామణిలో ఉన్న కాయిన్లను ఆయన సేకరించారు.
ఇందులో భాగంగానే రూ. 8 వేల విలువ చేసే డీడీని ఆర్బీఐ పేరిట చెల్లించి ఆన్లైన్లో వెయ్యి రూపాయల కాయిన్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో 40 గ్రాముల వెండితో తయారు చేసిన కాయిన్ పంపారు.
How to get coin ,please send me clear and full info pls
ReplyDelete