ఒంటిపూట బడులు ఏప్రిల్ ఒకటో తారీకు నుంచి ఒక నెలపాటు ???
జూన్ 30 వరకు వేసవి సెలవులు ఉండే అవకాశం ???
ట్రాన్స్ఫర్స్ తో పాటు ఇంక్రిమెంటు తో కూడిన సుమారు 34 వేల పైచిలుకు ప్రమోషన్లు ..
పి జి టి అనబడే లెక్చరర్ ప్రమోషన్లు కూడా ఉండే అవకాశం ???
గౌ౹౹ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శ్రీ ప్రతాప్ రెడ్డి గారి మాటల్లో ఒంటిపూట బడులు ఏప్రిల్ ఒకటో తారీకు నుంచి ఒక నెలపాటు ఉంటుంది. మే ఒకటో తారీకు నుండి వేసవి సెలవులు జూన్ 30 వరకు ఉండే అవకాశం ఉంది అని చెప్పారు.
జూన్ నెల లోపు ట్రాన్స్ఫర్స్ తో పాటు ఇంక్రిమెంటు తో కూడిన ప్రమోషన్లు సుమారు 34 వేల పైచిలుకు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్స్ గా ప్రమోషన్ పొందే అవకాశం మరియు దీనికి అదనంగా పాఠశాలలో ఏర్పాటు చేయబడిన ఇంటర్ విద్య విద్యార్థులకు బోధించడానికి పి జి టి అనబడే లెక్చరర్ ప్రమోషన్లు కూడా ఉంటాయని తెలియజేశారు. నూతన విద్యా విధానం అమలులో భాగంగా పాఠశాల విద్యలో సంచలనాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని ఇవన్నీ ఉపాధ్యాయులు కి లాభదాయకంగానే ఉంటుందని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అధైర్య పడవద్దని చెప్పడం జరిగింది.
0 Comments:
Post a Comment