VVIP Tree In Madhya Pradesh: సాధారణంగా కొందరు చెట్లను నాటుతారు. కానీ వాటిని అసలు పట్టించుకోరు. ఎవో చెట్లును నాటేసి.. ఫోటోలకు ఫోజులిచ్చేసి తర్వాత..
దాని గురించి అసలు దాన్ని పట్టించుకోరు. కానీ కొందరు మాత్రం చెట్టుని నాటి వదిలేయకుండా.. దాని యోగక్షేమాలను సైతం గమనిస్తుంటారు.
కొంత మంది వీవీఐపీలు.. చెట్లను నాటి.. అది జాగ్రత్తగా పెరిగే విధంగా చూసుకుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఒక చెట్టు వార్తలలో నిలిచింది.
మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో ఒక బోధి చెట్టు ఉంది. రైసెన్ ప్రాంతంలో ఇది ఉంది. దీనికి 24 గంటల కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది.
దాని ఆకులలో ఒక్కటి రాలిన.. ఎండిపోయిన ఉన్నాతాధికారుల వరకు నివేదిక చేరిపోతుంది. ఈ బోధి వృక్షాన్ని 2012లో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే సాంచిలో నాటారని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమయంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ కూడా ఉన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి దీనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
స్థానిక ప్రజలు కూడా దీన్ని దూరం నుంచి చూస్తారు. అదే విధంగా బౌద్ధంలో కూడా దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ చెట్టు కింద కూర్చున్నప్పుడు బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందారని చెబుతారు.
అదే సమయంలో, అశోక చక్రవర్తి కూడా శాంతి కోసం వెతకడానికి ఈ చెట్టు నుండి ప్రేరణ పొందాడు.
అందుకే అంతటి గొప్పతనం ఉన్న ఈ చెట్టును.. కాపాడటానికి వాచ్ మెన్ పగలు, రాత్రి కాపాలా కాస్తారు. దీని చుట్టు 15 అడుగుల నెట్ ను కూడా అమర్చారు.
సాంచిలోని మున్సిపల్, పోలీసు, రెవెన్యు, హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ వారు ఈ చెట్టుని సంరక్షిస్తున్నారు.
చెట్టును కాపాడాటానికి ఏటా లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు.
దీనికి ప్రత్యేక మైన ఎరువులను ఉపయోగిస్తారు. ఇది చూడటానికి సాధారణంగా కనిపించిన.. దీనికి భద్రత, కల్పిస్తున్న ప్రత్యేక భద్రత వలన దీన్ని వీవీఐపీ చెట్టుగా చూస్తున్నారు.
ఈ ప్రత్యేక మైన చెట్టును చూడటానికి చాలా మంది ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు.
0 Comments:
Post a Comment