2022-23 సంక్షేమ పథకాల క్యాలెండర్ను విడుదల చేసిన సిఎం జగన్
అమరావతి : 2022-23 సంక్షేమ పథకాల క్యాలెండర్ను సిఎం జగన్ శుక్రవారం విడుదల చేశారు. ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు సంక్షేమ క్యాలెండర్ను ప్రకటించారు.
క్యాలెండర్లో ... ఏప్రిల్లో వసతి దీవెన, వడ్డీలేని రుణాలు, మే లో విద్యా దీవెన, అగ్రి కల్చర్ ఇన్సూరెన్స్, రైతు భరోసా, మత్య్సకార భరోసా, జూన్లో అమ్మ ఒడి పథకం, జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు, ఆగష్టులో విద్యా దీవెన, ఎంఎస్ఎంఈలకు ఇన్సెన్టివ్, నేతన్న నేస్తం, సెప్టెంబర్లో వైఎస్సార్ చేయూత, అక్టోబర్లో వసతి దీవెన, రైతు భరోసా, నవంబర్లో విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు, డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలు, జనవరిలో రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు పథకాలు, ఫిబ్రవరిలో విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాలు, మార్చిలో వసతి దీవెన అమలుకు సంబంధించిన వివరాలను ముద్రించిన క్యాలెండర్ను ముఖ్యమంత్రి విడుదల చేశారు.
0 Comments:
Post a Comment