🔳బడికోసం పసిపిల్లలు 2-3 కి.మీ.లు వెళ్లాలా..
స్కూళ్ల విలీనంలో పోస్టులను కుదించే ఎకానమీ
పాఠశాలల తరలింపుతో సమస్యలు వాటిపై పిడికిలి బిగించి పోరాటం చేస్తాం మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీల హెచ్చరిక విలీనం పేరుతో మూసివేస్తున్నారు: బీజేపీ మాధవ్ కొత్త పోస్టులివ్వాలి కాని రద్దు చేయడమేంటి?: డొక్కాఅమరావతి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): పాఠశాలల విలీనంపైనా, ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేయడంపైనా శాసన మండలిలో వాడివేడిగా చర్చ జరిగింది. శుక్రవారం పీడీఎఫ్ ఎమ్మెల్యేలు ఈ అంశాలను లేవనెత్తగా బీజేపీ, వైసీపీ ఎమ్మెల్సీలు మాధవ్, డొక్కా మాణిక్య వరప్రసాద్ వారితో గొంతు కలిపారు. ‘‘రాష్ట్రంలో పెన్షన్లు, సంక్షేమం గడపగడపకూ అందిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం... పసి పిల్లలు స్కూళ్లకు వెళ్లడానికి రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణించేలా పాఠశాలలను ఎందుకు విలీనం చేస్తున్నారు? రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హైస్కూళ్లలో, ప్రాథమిక పాఠశాలలను విలీనం చేస్తే చిన్నారులు ఎలా వెళ్లతారు? దీనికి పరిష్కారంగా గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవాలి. ఈ విలీనంలో ఉపాధ్యాయ పోస్టులను కుదించే ఎకానమీ ఉంది. తరలించేటప్పుడు నాడు నేడు పేరుతో కోట్లు ఖర్చు ఎందుకు చేశారు? కొత్తగా డీఎస్సీ వేయకపోగా ఉన్న ఎస్జీటీ పోస్టులను రద్దు చేయడం ఏమిటి?’’ అని అని ఐ.వెంకటేశ్వరరావు నిలదీశారు. విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... ‘‘పాఠశాలల విలీనంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఏకపక్షంగా విలీనం చేయడం తగదు. విలీనం ప్రక్రియ వల్ల పిల్లలకు మేలు జరిగితే మేం చేతులెత్తి దండం పెడతాం. లేకపోతే పిడికిలి బిగించి పోరాటం చేస్తాం’’ అని హెచ్చరించారు. మరో ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ... ‘‘రాష్ట్రంలో 34 వేల ప్రథమిక పాఠశాలల్లో ఉన్న సుమారు 3, 4 లక్షల మంది పిల్లల్ని హైస్కూళ్లకి తరలిస్తున్నారు. దీనిలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించకుండా ఈ తరలింపు జరిగితే డ్రాపౌట్స్ పెరుగుతారు. ప్రాథమిక పాఠశాల నుంచి పిల్లలను హైస్కూళ్లకు తరలించడం వల్ల క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ‘అమ్మ ఒడి వద్దు... మా స్కూల్ తరలించవద్దు’ అంటూ నినదించిన ఘటనలూ ఉన్నాయి. టీచర్ పోస్టులు రద్దు చేయమంటూనే ఎస్జీటీ పోస్టులు రద్దు చేయడం దారుణం’’ అని అన్నారు. ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే గదుల కొరత ఉందని షేక్ సాబ్జీ అన్నారు. పాఠశాలల విలీనం పేరుతో ప్రాథమిక పాఠశాలలను మూసివేసే కార్యక్రమం జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. మూడవ తరగతి పిల్లలు హైస్కూల్ కి వెళితే మిస్‌మ్యాచ్ అవుతుందేమో ఆలోచించాలని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ సూచించారు.
ఏ బడినీ మూసేయడం లేదు: మంత్రి ఆదిమూలపుఈ చర్చకు సమాధానంగా మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఎక్కడా ఏ పాఠశాల మూసివేయడం లేదు. అదనపు తరగతి గదుల నిర్మాణం చేస్తాం. అవసరం మేరకు ఉపాధ్యాయ ఖాళీలనూ భర్తీ చే స్తాం. ఉపాధ్యాయ పోస్టుల సప్రెస్ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. గత 40 ఏళ్లుగా భర్తీకాని వాటినే మేం సప్రెస్ చేస్తున్నాం. ఇవి కాకుం డా ఇంకా రాష్ట్రంలో 6 వేల పోస్టులు ఉన్నాయి. ఉపాధ్యా, విద్యార్థి నిష్పత్తిని మేం ఫాలో అవుతున్నాం. ఎస్జీటీలకు పదోన్నతులు ఇచ్చి అవసరమైన పోస్టులు భర్తీ చేస్తాం’’ అని మంత్రి స్పష్టం చేశారు.
0 Comments:
Post a Comment