ఏప్రిల్ నాలుగో వారంలో పది పరీక్షలు ? గురువారం జరిగిన సమావేశంలో అధికారుల నిర్ణయం.
✍ఏప్రిల్ నాలుగో వారంలో పది పరీక్షలు??
🌻ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్షల తేదీలు మారనున్నాయి. ఏప్రిల్ నాలుగో వారం నుంచి నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇంటర్మీడియట్ పరీక్షలను మే 6 నుంచి నిర్వహిస్తున్నందున పదో తరగతి పరీక్షల షెడ్యూల్లో అధికారులు మార్పులు చేస్తున్నారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే రెండో తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇదే సమయంలో ఇంటర్ పరీక్షలున్నాయి. రెండు పరీక్షలు ఒకే సమయంలో లేకుండా చూసేందుకు గురువారం ఇంటర్ విద్యామండలి, పాఠశాల విద్యాశాఖ అధికారులు సమావేశమయ్యారు. పరీక్షల తేదీలపై చర్చించారు. ఇంటర్ పరీక్షలను తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్లోనే నిర్వహించనున్నారు.
0 Comments:
Post a Comment