ఉపాధ్యాయ సంఘాలపై సజ్జల ఆగ్రహం
ఉపాధ్యాయ సంఘాల నేతలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ ఉదారతతో 23 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు నిర్ణయించారన్నారు.
సీఎంతో భేటీలో పత్రాలపై సంతకాలు పెట్టి, తీరా బయటకెళ్లాక అడ్డం తిరిగారని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి నలుగురిని ప్రతినిధులుగా పెట్టారని, వారితోనే ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందని అన్నారు. మినిట్స్ కూడా తయారై, వాటిని చీఫ్ సెక్రటరీ చదువుతుండగా కూడా వారు విన్నారన్నారు. చివరకు బయటకెళ్లి మరోలా మాట్లాడడమే అపశ్రుతిగా అభిప్రాయపడ్డారు.
ఇది పద్ధతి కాదని అన్నారు. ఉద్యోగులు పట్టువిడుపులు ప్రదర్శించాలన్నారు. ఉద్యోగుల వినతులన్నింటినీ సీఎం జగన్ పరిష్కరించారని చెప్పారు. ఆర్థిక పరిస్థితులు సహకరించకున్నా మెరుగైన ఫిట్మెంట్ ప్రకటించారని గుర్తు చేశారు. వీటన్నింటినీ ఉద్యోగులు గమనించుకోవాలని సూచించారు.
0 Comments:
Post a Comment