NGT: ఏపి సర్కార్ కు ఎన్జీటీ షాక్.. వాటికి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే...
NGT: ఏపి సర్కార్ కు జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) షాక్ ఇచ్చింది. చిత్తూరు జిల్లాలో చేపట్టిన మూడు రిజర్వాయర్ల పనులు నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశించింది.
అవులపల్లితో పాటు మూడు రిజర్వాయిర్లకు ఎన్జీటీ బ్రేక్ వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ రిజర్వాయర్ పనులకు పర్యావరణ అనుమతులు తప్పకుండా తీసుకోవాల్సిందేనని ఎన్జీటీ స్పష్టం చేసింది.
అనుమతులు లేకుండా గాలేరు - నగరి సుజల స్రవంతి, హంద్రీనివా సుజల స్రవంతి పథకాల కింద రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారంటూ చిత్తూరు జిల్లాకు చెందిన రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఎన్జీటీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ముదివీడు, పుంగనూరు మండలం నేతిగుంటపల్లి, సోమల మండలం ఆవులపల్లి రిజర్వాయర్ల నిర్మాణం పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్నారంటూ సోమల మండలానికి చెందిన జి గుణశేఖర్ మరో 12 మంది రైతులు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ..పనులు నిలుపుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
0 Comments:
Post a Comment