ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం తెల్లవారు జామున ఛాతీ నొప్పితో కూలబడిపోయారు. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు గౌతంరెడ్డిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి వైద్యం అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదే సెగ్మెంట్ నుంచి 2014లోనూ గెలుపొందారు. మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి జగన్ కేబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు. ఇటీవలే దుబాయి పర్యటనకు వెళ్లి వచ్చారు గౌతమ్‌రెడ్డి.
గౌతమ్ రెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.
మంత్రి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు.. గౌతమ్‌రెడ్డికి గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయస్సు 49 ఏళ్లు.. ఆయన 1971లో జన్మించారు. ఆయన నాలుగు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్లారు. వారం రోజుల పాటు దుబాయ్ ఎక్స్‌పోకు హాజరయ్యారు.గౌతమ్‌రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి. గౌతంరెడ్డి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు. ప్రస్తుతం గౌతంరెడ్డి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన 2014, 2019లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి గెలుపొందారు. ఆయన పారిశ్రామిక వేత్త.
0 Comments:
Post a Comment