🔳ఏపీ ప్రభుత్వంపై ఫ్యాప్టో కమిటీ ఫైర్.. ఆందోళనకు పిలుపు
అమరావతి: ప్రభుత్వం తీరుపై ఆందోళనలకు ఫ్యాప్టో కమిటీ ప్రతినిధులు సిద్ధమయ్యారు. 11వ పీఆర్సీ జీవోలను రద్దు చేసి, అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫిట్మెంట్ పెంపుదలపై చర్చకు అనుమతి ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చర్చల్లో ఉపాధ్యాయులకు, సీపీఎస్ సమస్యలు,కాంట్రాక్టు, ఔటసోర్స్, గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యల ప్రస్తావన లేదని మండిపడ్డారు. పీఆర్సీలో 27 శాతం కంటే ఎక్కువగా ఫిట్మెంట్ సాధనకు సీపీఎస్ రద్దుకోసం ,ఇతర సమస్యల పరిష్కారానికి దశల వారి పోరాటానికి పిలుపు నిచ్చారు. కలిసి వచ్చే సంఘాలను కలుపుకుని ఐక్యవేదిక ఏర్పాటు చేస్తామని చెప్పారు. 7వ తేదీ నుండి వారం రోజుల పాటు నల్ల బ్యాడ్జిలు ధరించి విధులకు హాజరు కావాలని పిలుపు నిచ్చారు. 11న 13 జిల్లాల కలక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలన్నారు. 12న కలిసి వచ్చే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని ఫ్యాప్టో కమిటీ ప్రతినిధులు తెలిపారు.
ఫిట్మెంట్ పై చర్చకు అనుమతి నివ్వని మంత్రివర్గ కమిటీ.. FAPTO తీవ్ర నిరసన
*11వ PRC GO లను రద్దు చేయాలని, అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ బహిర్గత పరచా లని, PRC సాధన సమితి అద్వ ర్యంలో చేసిన పోరాటకార్య క్రమాల వల్ల ఫిబ్రవరి 4,5 తేదీ లలో జరిగిన చర్చలలో ఫిట్మెంట్ పెంపుదల పై చర్చకు అనుమతి ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండి స్తున్నామని FAPTO రాష్ట్ర కమిటీ తెలిపింది*.
*జనవరి 17 వ తేదీ న ఇచ్చిన 11వ PRC GO ల వల్ల ఉద్యోగ ఉపాద్యాయ,పెన్షనర్స్ కి తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుందని, ఉద్యమ కార్యాచరణ కు FAPTO పిలుపు నిచ్చిందని తెలిపారు. జనవరి20 వతేది కలెక్టర్ కార్యాలయం ముట్టడి లో 60వేల ఉపాధ్యాయులు హాజరయ్యారు. దీని ఫలితంగా 4 JAC లు కలిసి PRC సాధన కమిటీ ఏర్పాటు జరిగింది . పోరాట కమిటీ ఫిబ్రవరి 3 ఇచ్చిన చలో విజయ వాడ లక్షలాది ఉద్యోగ ఉపాధ్యా య,పెన్షనర్స్ హాజరయ్యారని, దీని ఫలితంగా ప్రభుత్వం కదిలి చర్చలకు పిలిచారు..ఈ చర్చల లో ఉపాద్యాయు లకు,CPS సమస్యలు,కాంట్రాక్టు, ఔటసోర్స్, గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యల ప్రస్తావన లేకపోవడా న్ని నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. PRC లో 27% కంటే ఎక్కువగా ఫిట్మెంట్ సాధనకు CPS రద్దుకోసం ,ఇతర సమస్యల పరిష్కారానికి దశల వారి పోరాటానికి పిలుపు నిచ్చారు. ఈ పోరాటంలో కలిసి వచ్చే సంఘాలను కలుపుకుని ఐక్యవేదిక ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొదటి దశ పోరాట కార్యాచరణ లో భాగంగా*
*1) 7 . 02 . 2022 నుండి వారం రోజుల పాటు నల్ల బ్యాడ్జస్ ధరించి విధులకు హాజరగుట*
*2 ) 11 . 02 . 2022 న 13 జిల్లాల కలక్టర్ లకు వినతిపత్రాల సమర్పించుట*
*3 ) 12 .02 .2022 న కలిసి వచ్చే ఉద్యోగ , ఉపాద్యాయ సంఘూలతో రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడ నందు నిర్వహించుట* .
*FAPTO చైర్మన్ ch. జోసెఫ్ సుధీర్ బాబు గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశములో సెక్రటరీ జనరల్ ch. శరత్ చంద్ర, కో చైర్మన్ N. వెంకటేశ్వర్లు, ,K. భాను మూర్తి,K.కుల శేఖర్ రెడ్డి, వెలమల శ్రీనివాసరావు , అదనపు ప్రధాన కార్య దర్శి NV రమణయ్య, ch.వెంకటేశ్వర్లు, కార్యదర్శి కె.ప్రకాష్ రావు, కోశాధికారి G.సౌరి రాయులు మరియు FAPTO రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె ఎస్ ఏస్ ప్రసాద్ , మల్లు రఘునాథరెడ్డి , పి పాండురంగ వరప్రసాద్ , జి హృదయరాజు, కె నరహరి పర్రె వెంకటరావు ,మద్ది రాజేంద్ర ప్రసాద్ , AGS గణపతి , నరోత్తం రెడ్డి పాల్గొన్నారు*
*చైర్మన్ & సెక్రటరీ జనరల్*
*FAPTO , AP*
0 Comments:
Post a Comment