బిల్లులు ఆపండిట్రెజరీలో చెల్లింపులపై ఆంక్షలు
మౌఖిక ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం
వేతనాలు తప్ప ఇతర బిల్లులు నిలుపుదల
మార్చి వస్తుండటంతో కాంట్రాక్టర్ల ఆందోళన
ట్రెజరీపై మరోసారి ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
ఎలాంటి బిల్లులు చేయకుండా అమరావతిలోనే సాఫ్ట్వేర్ను బ్లాక్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు మినహా మిగిలిన ఎలాంటి బిల్లులను సాఫ్ట్వేర్ తీసుకోని పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో పలు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కాంట్రాక్టర్లు పలురకాల బిల్లులను ట్రెజరీ ద్వారా పెడుతుంటారు. అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దిగజారి పోవటంతో ఏ రోజుకారోజు అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వపరంగా చెల్లించాల్సిన వివిధ రకాల బిల్లులు కోట్లలో పెండింగ్లో ఉన్నాయి. వాటి కోసం ప్రభుత్వశాఖలతో పాటు కాంట్రాక్టర్లు కూడా తమ తమ శాఖల ద్వారా ఆ బిల్లులను ట్రెజరీ కార్యాలయాలకు పంపుతున్నారు. అయితే ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో ఉద్యోగుల వేతనాలు మినహా మిగిలిన బిల్లులన్నింటిని సాఫ్ట్వేర్ తీసుకోకుండా బ్లాక్ చేసినట్లు సమాచారం.
ప్రభుత్వం నుంచి ట్రెజరీకి ఆదేశాలు
కాగా ఎలాంటి బిల్లులు పెట్టవద్దని ప్రభుత్వం నుంచి ట్రెజరీ శాఖకు మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన వివిధ రకాల బిల్లులతో పాటు ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ బిల్లులు, భవనాల అద్దె బిల్లులు, వాహనాల అద్దె బిల్లులు వంటివి కూడా నిలుపుదల చేసినట్లు సమాచారం.
0 Comments:
Post a Comment