Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Tuesday, 8 February 2022

ఉద్యమాంధ్ర సమ్మె తప్పినా.. తగ్గని సెగలు

 🔳ఉద్యమాంధ్ర

సమ్మె తప్పినా.. తగ్గని సెగలు

పీఆర్సీపై ఉపాధ్యాయుల ఆందోళనలుమునిసిపల్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులదీ అదే బాట‘ప్రైవేటీకరణ’పై విద్యుత్‌లో భగభగలుకాకినాడలో కదం తొక్కిన ఆశా వర్కర్లుకలెక్టరేట్‌ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంకొత్త జిల్లాలపై కొనసాగుతున్న రగడటీచర్ల ఉద్యమం హాస్యాస్పదం: సజ్జల

‘సమ్మె’ ముప్పు తప్పింది. కానీ... రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాల సెగ రగులుతూనే ఉంది. పీఆర్సీపై పోరును ఉద్యోగ సంఘాల నేతలు విరమించినా... ఉపాధ్యాయులు మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు. సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వారం రోజులపాటు ఏదో ఒక రూపంలో ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు. భవిష్యత్‌ కార్యాచరణకు సిద్ధమవుతామని తెలిపారు. ఇక... రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల మునిసిపల్‌, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులూ జేఏసీ నేతలపై భగ్గుమన్నారు. తమ సమస్యలను పట్టించుకోకుండా, ప్రస్తావించకుండానే ఉద్యమాన్ని విరమించడంపై ఆందోళనకు దిగారు. కొవిడ్‌ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, పరిహారం చెల్లించాలని కాకినాడలో ‘ఆశా’ వర్కర్లు గర్జించారు. కలెక్టరేట్‌ను ముట్టడించారు. థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల ‘ప్రైవేటీకరణ’ను నిరసిస్తూ విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన తీవ్రమవుతోంది. ఇక... ‘కొత్త జిల్లాల’పై రగడ కొనసాగుతూనే ఉంది.

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ నేతలు కుదుర్చుకున్న ఒప్పందం.. పీఆర్సీని మళ్లీ రివర్స్‌ చేసేలా ఉన్నదంటూ ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టారు. దశలవారీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన టీచరు సంఘాలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి పాఠశాల విధులకు హాజరయ్యారు. కొన్ని జిల్లాల్లో రోడ్డుపైకి కూడా వచ్చారు. మోకాళ్లపై నిలబడి, ప్లకార్డులు పట్టుకుని మధ్యాహ్నం భోజన విరామం సమయంలో పాఠశాల వెలుపల నిరసన తెలిపారు. ఫ్యాప్టో పిలుపు మేరకు కొన్నిచోట్ల ఉద్యోగ జేఏసీ నేతలకు శవయాత్ర నిర్వహించారు. వారి చిత్రపటాలకు దండలు వేసి నివాళి పాటించారు. ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ యాజమాన్య పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పలు స్కూళ్లలో టీచర్లు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. పీఆర్సీని నిరసిస్తూ కడప సిటీలోని గాంధీనగర్‌ ఉన్నతపాఠశాల తోపాటు, పోరుమామిళ్ల మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రొద్దుటూరులోని నడింపల్లి మున్సిపల్‌ పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఫ్యాప్టో పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా లో ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఫ్యాప్టో బృందాలు వెళ్లి నిరసనలను పర్యవేక్షించాయి. ఏలూరులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ నేతృత్వంలో ఫ్యాప్టో బృందం తహసీల్దార్‌కు వినతిపత్రం అందచేశారు. పీఆర్సీలోని లోపాలను సరిదిద్దకపోతే ప్రభుత్వ బలాన్ని(సీట్లను) రెండంకెలకు తగ్గిస్తామని షేక్‌ సాబ్జీ హెచ్చరించారు. 

మినిట్స్‌ ప్రతులు దహనంతూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. విశాఖ జిల్లాలో ఉపాధ్యాయులు క్లాసుల మధ్య విరామంలో స్కూలు ప్రాంగణంలో సమావేశమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్నూలు ఏ క్యాంపు ఇందిరాగాంధీ స్మారక మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. విజయవాడ  సహా కృష్ణా జిల్లాలో భోజన విరామసమయంలో టీచర్లు ఆందోళనలు నిర్వహించారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయులు పెద్దఎత్తున ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో మినిట్స్‌ ప్రతులు దహనం చేశారు. 

పాఠశాలలో టీచరు దీక్షపీఆర్సీకి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం బాలినాయనిపల్లె హైస్కూల్‌లో ఫిజిక్స్‌ టీచర్‌గా పనిచేస్తున్న విష్ణువర్ధనరెడ్డి సోమవారం తాను పనిచేస్తున్న పాఠశాలలో నిరసన దీక్షకు కూర్చున్నారు. రెండురోజులపాటు తన దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. ఉద్యోగ నేతలను నమ్మి  తమకు తామే అన్యాయం చేసుకున్నామటూ తొట్టంబేడు మండలం పొయ్య గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తులసి, విజయ్‌కుమార్‌ పీఆర్సీకి వ్యతిరేకంగా తమ చెప్పులతో తామే కొట్టుకున్నారు. 

శవయాత్ర.. దండ వేసి నివాళి..పీఆర్సీ సాధించకుండానే ఉద్యమాన్ని ఆపేశారంటూ జేఏసీ నేతల తీరుపై వేర్వేరు రూపాల్లో ఉపాధ్యాయులు తమ నిరసనను తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఉద్యోగ జేఏసీ నేతల చిత్రపటాలకు దండలు వేసి నివాళి పాటించారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో ఉద్యోగ సంఘాల నేతలకు ఫ్యాప్టో నేతలు శవయాత్ర నిర్వహించారు. 

‘చలో’ టీచర్లకు వేధింపులు.. వివరాలివ్వాలని సహ టీచర్లపై ఒత్తిడిచలో విజయవాడలో పాల్గొని విజయవంతం చేసిన ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. రాజమహేంద్రవరంలో పలు పాఠశాలలకు పోలీసులు వెళ్లి.. టీచర్ల వివరాలు సేకరించారు. ఈ జిల్లాలో సుమారు 530మంది సెలవులు పెట్టి, చలో విజయవాడకు వెళ్లారు. వారందరి గురించి ఆరాలు మొదలయ్యాయి. మహిళా టీచర్ల వివరాలూ సేకరిస్తున్నారు. రాజమహేంద్రవరంఏసీ గార్డెన్‌లోని మున్సిపల్‌ ఎలిమెంటరీ స్కూల్‌కు చెందిన ఎంఎస్‌ జెస్సీ, బి.శాంతి, ఎస్‌వీవీ లక్ష్మి వివరాలు ఆ స్కూలు నుంచి తీసుకున్నారు. యూటీఎఫ్‌ అర్బన్‌ అధ్యక్షుడు రవిబాబు అడ్రస్‌, ఫొటో కావాలని.. సహ ఉపాధ్యాయులపై ఒత్తిడి చేసినట్టు తెలిసింది.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top