✍పాఠశాలల హెచ్ఎంలకు షోకాజ్లు
🌻ఈనాడు, అమరావతి
పాఠశాలల్లో విద్యార్థులకు నిత్యం స్టూడెంట్ యాప్లో హాజరు నమోదు చేయాలన్న జిల్లా విద్యాశాఖ ఆదేశాలను కొన్ని పాఠశాలలు తుంగలో తొక్కాయి. కొన్ని పాఠశాలలు అసలు ఆన్లైన్లో హాజరు వేయటం లేదని పరిశీలనకు వెళ్లిన అధికారులు నివేదించటంతో ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. బాధ్యులైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. అమ్మఒడి పథకానికి ఆన్లైన్ హాజరును పరిగణనలోకి తీసుకుంటామని ప్రతి విద్యార్థికి ఆన్లైన్లో హాజరు తప్పనిసరి చేస్తూ గతంలోనే జిల్లా విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 30 పాఠశాలల నిర్లక్ష్యంపై వివరణ తీసుకోవాలని జిల్లా సంయుక్త పాలనాధికారి(సచివాలయాలు) రాజకుమారి ఆదేశించటంతో డీఈవో గంగాభవానీ సంబంధిత పాఠశాలల హెచ్ఎంలను తాకీదు అందిన మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. వీటిల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని విద్యాశాఖవర్గాలు తెలిపాయి.
0 Comments:
Post a Comment