ఏపీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ బదిలీ.. ప్రధాన కారణం ఇదేనా?!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయ్యారు. ఆయనను ఢిల్లీలో ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా ఆయనను నియమించారు.
అవినీతి ఆరోపణలు లేనప్పటికీ.. వివాదాస్పద నిర్ణయాలతో ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించిన కారణంగానే ఆయన బదిలీ జరిగినట్లు భావిస్తున్నారు. ఇటీవలి సభలో సీఎం జగన్ వద్ద మోకాళ్లపై కూర్చుని పతాకశీర్షికలకు ఎక్కడంతో ప్రవీణ్ ప్రకాష్ పేరు మోగిపోయింది.
ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత ఇష్టమైన అధికారిగా తక్కువ కాలంలో పేరుపొందిన ప్రవీణ్ ప్రకాష్.. సీఎం కోటరీ సభ్యుడిగా చేరి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయికి చేరుకున్నారు. సీఎం కార్యాలయ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆయన పనితీరుతో ఏకంగా సీఎం జగన్నే ఇబ్బంది పెట్టినట్లుగా చెప్పుకుంటున్నారు. సీఎంఓలో ఉన్నప్పుడు మంత్రులను కూడా ముఖ్యమంత్రిని కలువనిచ్చే వారు కాదని, నియోజకవర్గ సమస్యలపై తానే విన్నపాలు విని పంపించేవాడని చెప్తుంటారు.
పలుసార్లు ఈయన విడుదల చేసిన జీవోలు వివాదాస్పదంగా మారాయి. చీఫ్ సెక్రటరీలకు తెలియకుండానే ఉత్తర్వులు ఇచ్చేవారని కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈయన వ్యవహార శైలిపై మంత్రులు మొదలుకొని ఎమ్మెల్యేల వరకు వరసపెట్టి ఫిర్యాదుల అందడంతో సీఎంఓ నుంచి ప్రవీణ్ ప్రకాష్‌ను జగన్ తప్పించారు. అయితే, ఇటీవల ఉద్యోగ సంఘాల విషయంలో జగన్‌ను తప్పుదోవ పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమ్మెకు వెళ్లకుండా ముందుగానే సమస్యను పరిష్కరించాల్సిందిపోయి ఉద్యోగ సంఘాలు అంగీకరించినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారంట. దాంతో చిర్రెత్తుకొచ్చిన సీఎం జగన్.. అకస్మాత్తుగా ఆయనను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతల నుంచి తప్పించి ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించారు.
0 Comments:
Post a Comment