🔳మోసపోయాం
అర్ధరాత్రి పోరాటాన్ని తాకట్టు పెట్టారు
ఎన్జీవో నేతల రాజీ వెనుక వంచన
జేఏసీ పదవులకు రాజీనామా చేస్తున్నాం
ఉపాధ్యాయ సంఘాల నేతల ప్రకటన
నేటి నుంచే నిరసనలకు సిద్ధం
కొత్త జేఏసీతో పోరు కొనసాగింపు: ఫ్యాఫ్టో
మా సమస్యలు ఒక్కటీ ప్రస్తావించలేదు
జేఏసీ నేతలపై ఆర్టీసీ సిబ్బంది ఆగ్రహం
పోరుకు కాంట్రాక్టు ఉద్యోగులూ సై
ఏం తప్పు చేశామని సజ్జలకు క్షమాపణ చెప్పారు!
ఉద్యమ చరిత్రలో ఇంత అవమానకర ఘటన లేదు
ఇక నమ్మొద్దు.. మన జీవోలొచ్చాక టీచర్లతో కలుద్దాం
ఆర్టీసీ యూనియన్లకు కార్మికుల సూచన
(అమరావతి-ఆంధ్రజ్యోతి) ‘ఉద్యమానికి ఆర్టీసీ సిబ్బంది ఆక్సిజన్ అన్నారు. ప్రభుత్వ మెడలు వంచేందుకు బస్సులు ఆపిస్తామన్నారు. చివరికి పీటీడీ(ఆర్టీసీ) ఉద్యోగుల సమస్య ఒక్కటైనా ప్రస్తావించలేదు. పైగా ఏదో తప్పు చేసినట్లు సీఎంతోపాటు సలహాదారు సజ్జలకు క్షమాపణలు చెప్పారు. ఆర్టీసీ ఉద్యమ చరిత్రలో ఇంత అవమానకరమైన సంఘటన మరొకటి లేదు’ అంటూ 13 జిల్లాల్లోని ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎన్ఎంయూ, ఈయూలతోపాటు ఇతర సంఘాల నేతల తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రివర్స్ పీఆర్సీ, హెచ్ఆర్ఏ కోత ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాల నేతలు ఎన్నడూ ఒక్క మాట మాట్లాడలేదని, సోషల్ మీడియాలో ఉద్యోగులు నిలదీయడంతో డ్రామాలాడుతూ సమ్మె నోటీసు ఇచ్చారని విమర్శిస్తున్నారు.
దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మారు వేషాల్లో విజయవాడకు ఉప్పెనలా వచ్చి తాడేపల్లిలో చెవులు పిక్కటిల్లేలా టీచర్లు నినదిస్తే వారి పోరాటాన్ని అర్ధరాత్రి తాకట్టు పెట్టారని మండిపడుతున్నారు. ఉదయం ఆర్టీసీ, టీచర్ల సంఘాలతో చర్చించి మరో దఫా చర్చలకు వస్తామని చెప్పకుండా ఎన్జీవో నేతలు రాజీ పడటంలో ఏం తాయులాలున్నాయో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. జేఏసీలో ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.రావు ఉన్నప్పటికీ ఆర్టీసీ సమస్యలు ఒక్కటైనా చర్చల్లో ఎందుకు ప్రస్తావించి పరిష్కారానికి చొరవ చూపలేదని నిలదీస్తున్నారు. వేరు కుంపటి పెట్టబోతున్న టీచర్లతో కలిసి పీటీడీ సిబ్బంది సమస్యల సాధనకు ఎన్ఎంయూ, ఈయూ, ఇతర ఆర్టీసీ సంఘాలు ఉద్యమించాలని సూచిస్తున్నారు.
0 Comments:
Post a Comment