నేటినుంచి యాప్ల డౌన్
ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం
అమరావతి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): పీఆర్సీ సాధన కోసం సమ్మెకు సిద్ధమైన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు...అంతకుముందునుంచే యాప్ల డౌన్ కార్యక్రమంతో సహాయ నిరాకరణ ప్రారంభించనున్నాయి.
శనివారం నుంచి యాప్ల డౌన్ కార్యక్రమం చేపట్టనున్నాయి. అంటే తమకు కేటాయించిన పని చేస్తారు కానీ...దాన్ని యాప్ ద్వారా ప్రభుత్వానికి నివేదించరు. ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక యాప్లు ఉన్నాయి. ఈ యాప్ల ద్వారా ప్రతిరోజు ఉపాధ్యాయులు ప్రభుత్వానికి రిపోర్టు ఇస్తుండాలి.
ఉదాహరణకు విద్యార్థుల హాజరును యాప్ ద్వారా పంపించాలి. మధ్యాహ్న భోజనం సమయంలో యాప్ ద్వారా ఆహారపదార్థాలను అప్లోడ్ చేయాలి. మరుగుదొడ్ల శుభ్రతపై యాప్ ద్వారా అప్లోడ్ చేయాలి. ఇలా చేయాల్సిన పనులుండడంతో...వాటన్నింటినీ ఉపాధ్యాయు లు చేస్తారు.
కానీ యాప్లో మాత్రం అప్లోడ్ చేయరు. సహాయనిరాకరణ చేస్తారు. సమ్మెకు రెండురోజుల ముందు ఈ కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించారు. మరోవైపు సమ్మె విషయానికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా వివరించాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. సమ్మెకు సంబంధించిన నోటీసును సంబంధిత డీడీవోలకు ఎక్కడికక్కడ అందించాలని, పాఠశాలల తాళాలు కూడా ఆయనకు స్వాఽధీనం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం సమ్మె జరగనీయకుండా చూస్తే,న్యాయమైన అంశాలను పరిష్కరించేందుకు అంగీకారం తెలిపితే...సోమవారం నుంచి పాఠశాలలకు వస్తామని, లేకుంటే సమ్మెలోకి వెళ్తామని అంటున్నారు.
0 Comments:
Post a Comment