Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Tuesday, 22 February 2022

AP Minister Mekapati: మంత్రి మేకపాటి మృతికి కారణం ఇదేనా..? ఆయన చివరి ట్వీట్ మరణంపైనే..

 AP Minister Mekapati: మంత్రి మేకపాటి మృతికి కారణం ఇదేనా..? ఆయన చివరి ట్వీట్ మరణంపైనే..

AP Minister Mekapati Goutham Reddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కేబినెట్ లో ఎందరు మంత్రులు ఉన్నా.. అక్కడ మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutahm Reddy) ఉన్నారు అంటే ఒక ప్రత్యేకంగా కనిపించే వారు..
ఆరడుగుల ఎత్తు.. కండలు తిరిగిన ఫిజిక్.. బాడీ బిల్డర్‌ను తలపించే స్ట్రక్చర్‌, ఫుల్‌ అండ్‌ ఫిట్‌నెస్‌.. నో హెల్త్‌ ఇష్యూస్.. ఇదీ ఆయన గురించి సన్నిహితులు చెప్పే హెల్త్ ప్రొఫైల్.. ఎప్పుడు చూసినా చిరునవ్వుతో.. పూర్తిగా ఫిట్ గా.. అసలు అలసట లేని వ్యక్తిగా కనిపిస్తారన్నది సన్నిహితుల మాట.. అంత ఆరోగ్యంగా కనిపించే గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో మరణించారంటే ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. అసలు ఆయన కేవలం గుండెపోటుతోనే మరణించారా? ఆదివారం రాత్రి ఏం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో గౌతమ్ రెడ్డి అకాల మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన గుండెపోటుతో కన్నుమూశారు అని తెలియగానే అంతా షాక్ అయ్యారు. ఆయనకు గుండెపోటు ఏంటని నివ్వెర పోయారు. ఆయన హఠాన్మరణంతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
గత వారం రోజులుగా మంత్రి మేకపాటి దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్న తరువాత ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. రావడం రావడమే నిన్న రాత్రి నెల్లూరులో ఒక నిశ్చితార్థం కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆ వెంటనే ఆయన తిరిగి హైదరాబాద్‌లోని ఇంటికెళ్లిపోయారు. తెల్లవారేసరికి, గౌతమ్‌రెడ్డికి సడన్‌ స్ట్రోక్‌. ఆస్పత్రికి తరలించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అయితే దుబాయ్‌ టూర్‌తో అలసిపోయిన గౌతమ్‌రెడ్డి, నెల్లూరుకి వచ్చిన వెంటనే మరో ప్రోగ్రామ్‌లో పాల్గొనడమే ఆయన కొంప ముంచిందా? లేక, మరేదైనా కారణమా? లేదా పోస్ట్‌ కోవిడ్‌ లక్షణాలేమైనా ఆయన ఊపిరి తీసేశాయా? గౌతమ్ రెడ్డి ఎంతో ఆరోగ్యంగా ఉంటారనీ. కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారనీ. హోటల్లో కూడా జిమ్ ఫెసిలిటీ చూసుకుంటారనీ చెబుతుంటారు ఆయన గురించి బాగా తెలిసిన వారు. జిల్లాలో ఎక్కడా ఎవరితోనూ వివాదాల్లేకుండా ఉంటారనీ. ఆయనెంతో మృధుస్వభావిగా చెబుతున్నారు ఆయన బంధు మిత్రులు.
ఆయన హెల్త్ కండిషన్ గురించి తెలిసిన వైద్యులు సైతం షాక్ కు గురవుతున్నారు. ఆయన హఠాన్మరణం వెనక పోస్ట్‌ కోవిడ్‌ లక్షణాలు కూడా ఉండొచ్చంటున్నారు. పోస్ట్‌ కోవిడ్‌ తర్వాత హార్ట్‌ ఎటాక్స్‌, కార్డియాక్‌ అరెస్టులు పోయాయంటున్నారు. గౌతమ్‌ డెత్‌కు కూడా పోస్ట్‌ కోవిడ్‌ లక్షణాలే కారణం కావొచ్చని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
ఇదీ చదవండి : పోలీసులని చూస్తే జాలితో కూడిన అసహ్యమేస్తోంది.. వైరల్ గా నారా లోకేష్ పోస్ట్
సాధారణంగా గౌతమ్ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం ఎదో ఒక అంశంపై ట్విట్టర్ లో పోస్టులు పెడుతూనే ఉంటారు. అలాంటి గౌతమ్ రెడ్డి తన ఆఖరి పోస్టు కూడా మరణానికి సంబంధించే పెట్టారు. ఫిబ్రవరి 13న రాహుల్ బజాజ్ మరణం మీద ట్వీట్ చేశారు.

మరోవైపు మేకపాటి మరణంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన హైదరాబాద్ బయలదేరారు. ఆయన మరణంతో రెండు రోజుల పాటు ఏపీలో సంతాప దినాలు ప్రకటించారు..

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top