Ap Dgp Gowtham sawang transfer: 'చలో విజయవాడ' ఏపీ ప్రభుత్వంలో చిచ్చు పెట్టిందా? అన్ని ఆంక్షలు పెట్టినా విజయవాడను ఉద్యోగులు పోటెత్తడం ప్రభుత్వంపై ఆగ్రహానికి కారణమైంది.
ఉద్యోగుల సమ్మె పోటెత్తడానికి పోలీసుల వైఫల్యమే కారణమని ప్రభుత్వం సీరియస్ కూడా అయినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటి నుంచి గుర్రుగా ఉన్న ప్రభుత్వం ఏపీ డీజీపీ బదిలీకి రంగం సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు మీడియాలో, ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు పడినట్లు తెలుస్తోంది. ఈయన స్థానంలో కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించబోతున్నట్టు సమాచారం. ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైన సంగతి తెలిసిందే.
లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకొని తమ బలాన్ని ప్రదర్శించారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా తరలివచ్చిన ఉద్యోగులను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే డీజీపీ గౌతం సవాంగ్ ను బదిలీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం సాగుతోంది.
రాజేంద్రనాథ్ రెడ్డి ని డీజీపీగా నియమించేందుకు రంగం సిద్ధమైందని.. దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈరోజు సీఎం జగన్ ను చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ బదిలీ గురించి వీరు చర్చించినట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక వివరణ రావాల్సి ఉంది. అప్పటివరకూ ఈ బదిలీ సంగతి తెలియదు.
0 Comments:
Post a Comment