📚✍ఏడాదిగా ఎదురుచూపే!
♦రిటైర్డ్ ఉద్యోగులకురూ.2100 కోట్లు బాకీ
♦దక్కని పీఎఫ్, బీమా, గ్రాట్యుటీ సొమ్ము
♦పాతికవేల మందికి తీరని కష్టం
♦దాటిపోయిన క్రిస్మస్, సంక్రాంతి గడువులు
♦గతంలో రిటైరైన రోజే చేతికి సొమ్ముసన్మానించి గౌరవంగా వీడ్కోలు
♦ఇప్పుడు పరిస్థితి తలకిందులు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)పాతికేళ్లో, ముప్పై ఏళ్లో ఉద్యోగం చేశారు! సర్వీసులో ఏపీజీఎల్ఐ, పీఎఫ్ పేరిట నెలనెలా సొమ్ములు దాచుకుంటూ వచ్చారు. దీనికి తోడుగా సర్కారు గ్రాట్యుటీ మొత్తం ఇస్తుందని... రిటైర్మెంట్ రోజున ఇదంతా కొండంత అండగా ఉంటుందనే ధీమాతో ఉంటారు. కానీ... వీరందరి ఆశలపై సర్కారు నీళ్లు చల్లుతోంది. గతంలో రిటైర్మెంట్ రోజునే అందే ప్రయోజనాలు... ఇప్పుడు ఏడాది అవుతున్నా దక్కడంలేదు. గ్రాట్యుటీ, పీఎ్ఫతోపాటు బీమా బాండ్ల గడువు తీరినా అంతే సంగతులు! ఈ మొత్తం దాదాపు రూ.2,100కోట్లు. ఈ సొమ్ములో పీఎఫ్, జీఎ్సఎల్ఐలు.. ఉద్యోగులు సర్వీసులో ఉన్నప్పుడు నెలనెలా దాచుకున్న సొమ్మే. అంటే... అచ్చంగా అవి ఉద్యోగుల డబ్బులే.
అదేవిధంగా ఉద్యోగు లు తమకొచ్చే జీతాన్నిబట్టి ఇంత మొత్తం బీమా బాండ్లు కొనాలని ప్రభుత్వం చెప్తుంది. అలా జీఎ్సఎల్ఐ బాండ్ల ను ఉద్యోగులు తమ సొమ్ముతోనే కొనుగోలు చేస్తారు. ఆ సొమ్ములు ప్రభుత్వం వద్ద ఉంటాయి. వాటి కాలపరిమి తి తీరిపోగానే చెల్లింపు చేయాలి. తమ ఆర్థిక అవసరాలకు దాచుకున్న వాటినే ప్రభుత్వం ఇవ్వకపోవడంతో.. డబ్బుల్లేక రిటైర్డు ఉద్యోగులు ఆవేదనలో ఉన్నారు.
*♦ఇప్పటికీ ఎదురుచూపులే..* గత ఏడాదిలో దాదాపు 25వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదవీ విరమణ చేశారు. వీరికి రూ.10 లక్షల నుంచి రూ.30లక్షల చొప్పున పీఎఫ్, గ్రాట్యుటీ, బీమా సొమ్ములు రావాల్సి ఉంది. ఏడాదికాలంగా వీటికోసం ఎదురుచూస్తున్నా నిరాశే మిగులుతోంది. ‘ఇదిగో ఇస్తున్నాం’ అంటూ గత ఏడాది ఆగస్టులో రూ.235కోట్లను ఇస్తున్నట్లు జీవో జారీ చేశారు. కానీ.. నిధులు మాత్రం విడుదల చేయలేదు. సీఎ్ఫఎంఎ్సలో పెండింగ్లో పెట్టేశారు. గతంలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజునే పదవీ విరమణ ప్ర యోజనాలన్నీ అందించేవారు.కానీ, ఇప్పుడు మాత్రం పరిస్థితి తలకిందులైంది.
*♦రెండు గడువులు పోయినా...* పదవీ విరమణ ప్రయోజనాలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పదే పదే అడగ్గా... క్రిస్మ్సకు సగం డబ్బు, సంక్రాంతికి సగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. క్రిస్మస్ వెళ్లిపోయింది. సంక్రాంతి కూడా పోయింది. అయి నా, డబ్బులు మాత్రం రాలేదు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదని, గుర్తు చేసుకుంటున్నారు. పీఆర్సీ ఆందోళనల సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు ఈ బకాయిల గురించి కూడా గట్టిగా మాట్లాడారు. కానీ... ప్రభుత్వం నుంచి ఏ హామీనీ పొందలేకపోయారు.
0 Comments:
Post a Comment