✍2 రోజుల్లోనే పూర్తి జీతాలు
♦రెండున్నరేళ్లలో ఇదే మొదటిసారి
♦ప్రతినెలా 20వ తేదీ వరకూ ఎదురుచూపులే
♦రెండున్నరేళ్లలో తొలిసారి సర్కారు మాయ
♦డిసెంబరు జీతాల్లో ఇంకా 1,300 కోట్లు పెండింగ్
🌻అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో మొదటిసారిగా నెల తొలి రెండురోజుల్లోనే పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్లు పడ్డాయి. దీనిపై ఉద్యోగులు, పెన్షనర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండున్నరేళ్లలో తమకెప్పుడూ సకాలంలో పెన్షన్లు అందలేదని చెబుతున్నారు. ప్రతినెలా చాలా ఆలస్యం గా అందేవని, 20వ తేదీ వరకూ ఎదురుచూపులు చూడాల్సి వచ్చేదంటున్నారు. అలాంటిది ఈ నెల 1నే అందరికీ పూర్తిస్థాయిలో పెన్షన్లు అందడం ఊహించని అంశమంటున్నారు. డిసెంబరుకు సంబంధించి ప్రభుత్వం తమకు రూ.1,300కోట్లు జీతాలు ఇంకా ఇవ్వాలని, వాటిని పెండింగ్లోనే ఉంచిందని చెప్పారు.
ముందు నెల జీతాలను పెండింగ్లో ఉంచి, తర్వాతి నెల జీతాలను పూర్తిస్థాయిలో ఇవ్వడం విచిత్రంగా ఉందంటున్నారు. కొత్త పీఆర్సీని బలవంతంగా తమపై రుద్దడానికే ఫిబ్రవరిలో పూర్తిగా జీతాలిచ్చారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబరు జీతాలతోపాటు రిటైర్మెంట్ ప్రయోజనాలు రూ.300 కోట్లు, సరెండర్ లీవ్స్, ఈఎల్స్ తాలూకు రూ.650 కోట్లు, ఉద్యోగులకు అందాల్సిన అడ్వాన్సులు రూ.2,000 కోట్లు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయని, వాటిని ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తున్నారు.
0 Comments:
Post a Comment