Employees' strike is illegal
Retired Professor Pillai in the High Court
🔳ఉద్యోగుల సమ్మె చట్టవిరుద్ధం
హైకోర్టులో రిటైర్డు ప్రొఫెసర్ పిల్
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): పీఆర్సీపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విశాఖకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఎన్.సాంబశివరావు శుక్రవారం ఈ పిల్ వేశారు. ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసును రాజ్యాంగ, చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని అభ్యర్ధించారు. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడం సర్వీసు నిబంధనలకు విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఉద్యోగులు సమ్మెకు వెళితే సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఉద్యోగుల ఉద్యమంతో కోవిడ్ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు.
0 Comments:
Post a Comment