పీఆర్సీ జీవోలు రద్దుచేస్తేనే చర్చలు.. గెజిటెడ్ జేఏసీ
ఏపీలో పీఆర్జీ జీవోలు రద్దుచేయాలని ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ చైర్మన్ కేవీ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో గెజిటెడ్ అధికారుల జేఏసీ చర్చలకు వెళ్ళడంలేదన్నారు.
సోమవారం హైకోర్టు నిర్ణయాన్ని బట్టి మా కార్యాచరణ ఉంటుందన్నారు. కొత్త పీ ఆర్ సీ అంశం హై కోర్టు లో విచారణ ముగిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ పై జేఏసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఉద్యోగుల న్యాయమైన హక్కులు కాపాడుకునేందుకు చివరి వరకు పోరాడతాం అన్నారు. గతంలో ఉద్యోగుల హక్కులు కాపాడే అంశంలో హై కోర్టు సుప్రీం కోర్టు లు గొప్ప తీర్పులు ఇచ్చాయన్నారు కేవీ కృష్ణయ్య. న్యాయస్థానంలో తమకు మంచి జరుగుతుంది అన్న నమ్మకం ఉందన్న ధీమా వ్యక్తం చేశారు.
జీతాల ఆధారపడి జీవించే చిన్న ఉద్యోగుల పరిస్థితి ప్రభుత్వం అర్దం చేసుకోవాలన్నారు. ఉద్యోగులకు భేషజాలు లేవు. పీఆర్సీ జీవోలను తాత్కాలికం గా నిలుపుదల చేస్తే చర్చలకు సిద్దం అన్నారు.
0 Comments:
Post a Comment